చారి 111 మూవీ ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్

కమెడియన్ వెన్నెల కిశోర్ హీరోగా.. సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్ గా రాబోతున్న మూవీ చారి 111. టీజి కీర్తి కుమార్ డైరెక్షన్‌లో బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మించిన ఈ చిత్రం మార్చి 1 న రిలీజ్‌ కాబోతుంది. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్.


‘నేను తెలుగు వాడిని. బెంగళూరులో పదేళ్లు యాడ్ ఫిలిమ్స్ చేసి సినిమాల్లోకి వచ్చా. ‘చారి 111’కి ముందు ‘మళ్ళీ మొదలైంది’ సినిమా చేశా. అందులో వెన్నెల కిశోర్ గారు కమెడియన్ రోల్ చేశారు. ఆయనకు అప్పుడే ఈ సినిమా కథ చెప్పా. ఆయనకు నచ్చడంతో సినిమా స్టార్ట్ చేశామన్నారు డైరెక్టర్ కీర్తి కుమార్.
నిర్మాతగా నా తొలి సినిమా ఇది. సంథింగ్ డిఫరెంట్, కొత్తగా ట్రై చేశాం. ఫెంటాస్టిక్ టీం కుదిరింది. సినిమాలో పాటకు రామజోగయ్య శాస్త్రి గారు అద్భుతమైన సాహిత్యం అందించారు. వెన్నెల కిశోర్ గారికి నేను పెద్ద ఫ్యాన్ అని చెప్పుకున్నారు నిర్మాత అదితి సోని.


ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పారు హీరోయిన్ సంయుక్త విశ్వనాథన్‌. వెన్నెల కిశోర్ గారు ఫెంటాస్టిక్ యాక్టర్‌ అని, స్టంట్స్‌ చేయించిన కరుణాకరణ్ కి స్పెషల్ థ్యాంక్స్ అన్నారు హీరోయిన్ సంయుక్త. నెక్ట్స్ ప్రెస్‌మీట్‌లో తెలుగులో మాట్లాడతానన్నారామె.


ఈ కార్యక్రమంలో సరస్వతీ పుత్ర హరిరామజోగయ్య పాల్గొన్నారు. ఇందులో ఉన్నది ఒకే ఒక్క పాట. కానీ ఆ పాట రాయడానికి మూడు నెలల టైమ్‌ పట్టిందన్నారు. వెన్నెల కిశోర్ తాలూకూ కామెడీ యాంగిల్, సినిమా తాలూకూ వేరియేషన్స్‌ ని సాహిత్యంగా మలిచి పాట రాసానన్నారు. అంతకాలం వెయిట్ చేసిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్‌ అన్నారు హరిరామజోగయ్య.

Related Posts