ప్రభాస్ కల్కిపై రాజమౌళి ట్వీట్

నిన్నటి నుంచి కంట్రీ మొత్తం కల్కి మేనియాతో ఊగిపోతోంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ కోసం దేశమంతా ఎదురుచూస్తోంది. ఫస్ట్ గ్లింప్స్ వచ్చిన తర్వాత అప్పటి వరకూ ఉన్న అనుమానాలన్నీ తీరిపోయాయి. ప్రాజెక్ట్ కే నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ అంటూ విడుదల చేసిన పోస్టర్ కు పూర్తి భిన్నంగా గ్లింప్స్ ఓ రేంజ్ లో ఉంది.

ఇది ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు కూడా. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో 2898 కాలంలో సాగే కథ అంటూ ఇచ్చిన హింట్, విజువల్స్, ప్రభాస్ లుక్, దీపికా ప్రెజెన్స్ అన్నీ అద్భుతం అనేలా ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న చాలామంది సెలబ్రిటీస్ ఈ గ్లింప్స్ గురించి తెగ పొగుడుతున్నారు.

బట్ చాలామంది ఒక్కరి మాట కోసం చూశారు. ఫైనల్ గా అతనూ చెప్పాడు. యస్.. ఈ గ్లింప్స్ పై రాజమౌళి అభిప్రాయం ఎలా ఉంటుందా అనుకున్నారంతా. అయితే అందర్లానే అతను కూడా ఈ గ్లింప్స్ కు ఫిదా అయిపోయినట్టుగా చెప్పాడు.


తాజాగా రాజమౌళి కల్కి సినిమా గ్లింప్స్ చేసిన ట్వీట్ చూస్తే… ” కంగ్రాట్యులేషన్స్ నాగి అండ్ వైజయంతీ మూవీస్.ఒక ప్రామాణికమైన ఫ్యూచరిస్టిక్ మూవీని రూపొందించడం చాలా కష్టమైన పని. మీరు దీన్ని సాధ్యం చేసారు..డార్లింగ్ లుక్ అదిరిపోయింది..ఒక్క ప్రశ్న మాత్రమే మిగిలి ఉంది…విడుదల తేదీ…🥰..” అంటూ స్మైలీ ఎమోజీని యాడ్ చేశాడు.


సో రాజమౌళికి ఈ గ్లింప్స్ బాగా నచ్చింది. అందుకే అందర్లా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నట్టుగా అర్థం అవుతోంది. ఇక ఇండియన్ సినిమా ఇంటర్నేషనల్ లెవల్లో ఈ స్థాయిలో ఉందంటే అదంతా రాజమౌళి చలవే. అతను చేసిన ధైర్యం వల్లే మన సినిమా బడ్జెట్ పెరిగింది. బౌండరీస్ ని దాటుతోంది. ప్రపంచ సినిమా వేదికలపై సగర్వంగా తలెత్తుకుని నించుంది.అందుకే అతను ఏం చెబుతాడా అని ఎదురుచూశారు. ఏదేమైనా ఓ బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసిన వాడి నుంచి వచ్చే ప్రశంస భలే కిక్ ఇస్తుంది కదా..?

Related Posts