ఫస్ట్ మూవీతోనే వంద కోట్ల క్లబ్ లో చేరాడు మెగా ఫ్యామిలీ కుర్రాడు వైష్ణవ్ తేజ్. లుక్స్ బావున్నాయి. నటన కూడా ఫర్వాలేదు అనిపించాడు అనే కమెంట్స్ తెచ్చుకున్నాడీ మూవీతో. దీంతో ఆ ఫ్యామిలీ నుంచి ఓ పెద్ద స్టార్ అవుతాడు అనుకున్నారు. కానీ కుర్రాడు తర్వాత చేసిన కొండపొలం, రంగరంగ వైభవంగా సినిమాలు పోటీ పడి మరీ ఫ్లాప్ అయ్యాయి.
ప్రస్తుతం ఆదికేశవ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సారి మాస్ స్టోరీ ఎంచుకున్నాడు. పైగా రాయలసీమ నేపథ్య కూడా ఉంది. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో మోస్ట్ టాలెంటెడ్ మళయాలీ యాక్టర్ జోజూ జార్జ్ తో పాటు ఓ కీలక పాత్రతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు.
ఇక ఈ మూవీని ఆగస్ట్ 18న విడుదల చేస్తున్నాం అని గతంలో ప్రకటించారు. బట్ తాజాగా ఆ డేట్ నుంచి తప్పుకుంటున్నట్టు సమాచారం. ఇంకా షూటింగ్ కు సంబంధించి కొంత బ్యాలన్స్ ఉందట. అది పూర్తి చేసుకుని రిలీజ్ డేట్ వరకూ వచ్చేసరికి ప్రమోషన్ కు సమయం సరిపోదు అని భావిస్తున్నారట. దీనికి తోడు వరుసగా ఈ నెలంతా మెగా మూవీస్ ఉన్నాయి.
ఈ నెల 28న బ్రో, ఆగస్ట్ 11న మెగాస్టార్ భోళా శంకర్ తో పాటు వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున ఆగస్ట్ 25న వస్తోంది. ఇన్ని మెగా సినిమాల మధ్య వస్తే తన సినిమాక పెద్ద తలకాయల నుంచి ప్రమోషన్ రాదు అనుకున్నాడేమో.. ఈ మూవీని ఆగస్ట్ నుంచి పోస్ట్ పోన్ చేస్తున్నట్టు టాక్. ఒకవేళ అదే జరిగితే సెప్టెంబర్ లో దాదాపు అన్ని డేట్స్ లోనూ భారీ సినిమాలున్నాయి. సో.. కుదిరితే కుర్రాడు నవంబర్ లేదా డిసెంబర్ మొదటి వారంలో రావొచ్చు అంటున్నారు.