తెలుగులో ఈ దశాబ్దంలోనే ఆ మాటకొస్తే ఈ రెండు దశాబ్దాల్లోనే ది బెస్ట్ స్పై థ్రిల్లర్ అంటే అంతా గూఢచారి అని చెబుతారు. అంతకు ముందు తనకంటూ స్పెషల్ ఇమేజ్ లేని శేష్.. క్షణం మూవీతో మంచి ఇంపాక్ట్ వేశాడు. ఆపై వచ్చిన గూఢచారి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద టాలీవుడ్ అయింది. చాలా లో బడ్జెట్ తో హై క్వాలిటీ మూవీ తీసి చూపించాడు.
తనే స్వయంగా రాసుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే ఇది. అఫ్ కోర్స్ కొంతమంది సీనియర్స్ సాయం కూడా ఉంది. ఈ మూవీతో అప్పుడెప్పుడో పాతికేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ తో పాటుగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ రీ ఎంట్రీ ఇచ్చింది. శేష్ రా ఏజెంట్ గా నటించిన ఈమూవీలో థ్రిల్స్ తో పాటు మంచి ఎమోషన్ కూడా యాడ్ అవడంతో ఆడియన్స్ కు బెస్ట్ ఎక్స్ పీరియన్స్ గా నిలిచిపోయింది.
ఇక ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ఆ మూవీ ఎండ్ లోనే చెప్పాడు.ఆ సీక్వెల్ ఎప్పుడా అని ఇప్పటికీ ఎదురుచూస్తున్నారు గూఢచారి ఫ్యాన్స్. రీసెంట్ గా మేజర్, హిట్2 చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్న శేష్ .. ఈ చిత్రాన్ని పక్కన బెట్టాడా అనుకున్నారు. ఎందుకంటే ఆ మధ్య మరో సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వచ్చాయి. బట్ వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ లేటెస్ట్ గా గూఢచారి 2కు సంబంధించి ఓ కీలకమైన అప్డేట్ ఇచ్చాడు శేష్.
“గత ఆరు నెలలుగా దర్శకుడు వినయ్ కుమార్ తో పాటు రచయిత అబ్బూరి రవితో కలిసి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తున్నాం. ఈ సినిమా కోసం ఈ సారి భారీ విజన్ తో కూడిన భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ దర్శకుడి విజన్ చూస్తే కొన్నిసార్లు భయం కలుగుతుంది.కానీ అప్పటికీ దర్శకుడిని అడిగే ప్రశ్నేంటీ అంటే ఇంకా..” అని అంటూ ట్వీట్ చేశాడు శేష్. గూఢచారి టైమ్ లో శేష్ కెపాసిటీ ఏంటో అందరికీ తెలియదు. ఇప్పుడు తెలుసు కాబట్టి ఈ సారి బడ్జెట్ పెరుగుతుంది. కావాల్సిన ఆర్టిస్టులు దొరుకుతారు. సో.. ఈ సారి మరింత బెస్ట్ స్పై థ్రిల్లర్ ను ఎక్స్ పెక్ట్ చేయొచ్చన్నమాట.