అఖిల్ కోసం రంగంలోకి రాజమౌళి

కెరీర్ ఆరంభం నుంచి ఒక మంచి హిట్ కోసం ఇబ్బంది పడుతున్నాడు అఖిల్. ఆ మధ్య వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మాత్రమే కమర్షియల్ గా ఫర్వాలేదు అనిపించుకుంది. చివరగా వచ్చిన ఏజెంట్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు.

సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీ విడుదలకు ముందు కూడా చాలా హడావిడీ చేశాడు. బట్ .. బిగ్ డిజాస్టర్ గా తేలిందీ సినిమా. నిజానికి ఏజెంట్ కోసం అఖిల్ చాలా అంటే చాలా హానెస్ట్ గా హార్డ్ వర్క్ చేశాడు. అతని శ్రమంతా తెరపై కనిస్తుంది. కానీ కథ, కథనం వీక్ గా ఉండటంతో అతనూ ఏం చేయలేకపోయాడు. ఈ మూవీతర్వాత మరో ప్రాజెక్ట్ కోసం టైమ్ తీసుకున్నాడు. ఓ కొత్త దర్శకుడితో సినిమాకు ఓకే చెప్పాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందబోతోన్న ఈ చిత్రం కోసం రాజమౌళి రంగంలోకి దిగుతున్నాడు.


అఖిల్ కొత్త సినిమాను అనిల్ అనే దర్శకుడు రూపొందించబోతున్నాడు. అతనికి ఇదే డెబ్యూ మూవీ. ఏజెంట్ కు ముందు యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రం కోసం ఏకంగా వంద కోట్ల వరకూ బడ్జెట్ పెట్టడానికైనా రెడీగా ఉందనే టాక్స్ వచ్చాయి. బట్ ఏజెంట్ రిజల్ట్ తర్వాత పరిమిత బడ్జెట్ లోనే పూర్తి చేయబోతున్నారు. పైగా కథ, దర్శకుడూ మారినట్టు టాక్.

ఇప్పుడు కొత్త దర్శకుడు కావడంతో స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులను రాజమౌళి దగ్గరుండి స్వయంగా పర్యవేక్షిస్తున్నాడట. యూవీ క్రియేషన్స్ వారి రిక్వెస్ట్ మేరకే రాజమౌళి రంగంలోకి దిగాడు అంటున్నారు. ఒకవేళ జక్కన్న అందుబాటులో లేకపోతే.. అతని తనయుడు కార్తికేయ సైతం స్క్రిప్ట్ బెటర్ గా రావడానికి సాయం చేస్తున్నాడట.


రాజమౌళి సలహాలు, సూచనలు అంటే ఖచ్చితంగా అంచనాలు పెట్టుకోవచ్చు. సినిమా విడుదలకు ముందు అతను ట్వీట్ చేస్తే ప్రాబ్లమ్ కానీ.. రిలీజ్ ముందే స్క్రిప్ట్ లో మార్పులు చెబితే ఖచ్చితంగా అది బెస్ట్ అవుట్ పుట్ గానే మారుతుంది. అలా మారాలనే కోరుకుందాం.

Related Posts