రాధిక మేడమ్ దశ తిరుగుతున్నట్టేనా..

కన్నడ సీమ నుంచి హీరోయిన్లుగా వచ్చే బ్యూటీస్ లో అందంతో పాటు టాలెంట్ కూడా అదనంగా ఉంటుంది. పైగా తెలుగు చాలా త్వరగా నేర్చుకుంటారు. ఈ అడ్వాంటేజ్ తో వాళ్లు అప్పుడప్పుడూ తెలుగులో టాప్ లేపుతుంటారు. ప్రస్తుతం కన్నడ నుంచే వచ్చిన శ్రీ లీల కూడా టాప్ ప్లేస్ కు వెళ్లేలా ఉంది. అయితే తనకంటే ముందే వచ్చిన గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోన్న మరో బ్యూటీఫుల్ లేడీ నేహాశెట్టి.

2018లోనే మెహబూబా అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ డిజాస్టర్ కావడంతో అమ్మడిని పట్టించుకోలేదు. మూడేళ్ల తర్వాత సందీప్ కిషన్ గల్లీ రౌడీలో ఛాన్స్ వచ్చింది. ఈ మూవీ కూడా పోయింది. ఇక నేహా కెరీర్ ముగిసినట్టే అనుకున్నారు.

బట్ డిజే టిల్లుతో బౌన్స్ బ్యాక్ అయింది. ఈ మూవీలో రాధిక పాత్రలో మరో నటిని ఊహించుకునే ఆస్కారం కూడా ఇవ్వలేదు నేహాశెట్టి. దీంతో పాటు తన గ్లామర్ కూడా ప్లస్ అయింది. హీరోను అన్ని విధాలా వాడుకుని మోసం చేసి డబ్బుతో పారిపోవాలని ప్రయత్నించి ఆఖరికి కటకటాల పాలైన భామగా భలే నటించింది. అప్పటి నుంచి నేహాను రాధిక మేడమ్ అనే పిలుస్తున్నారు కుర్రాళ్లంతా. అంత ఇంపాక్ట్ వేసిందీ పాత్రతో.


విశేషం ఏంటంటే డిజే టిల్లు తర్వాత తనకు భారీ ఆఫర్స్ వస్తాయనుకుంది. అది కూడా కాస్త పెద్ద హీరోల నుంచి. బట్ రాలేదు. కాకపోతే ఆఫర్స్ మాత్రం వచ్చాయి. ఊహించినంత కాకపోయినా ఈ లైనప్ చూస్తుంటే రాధిక మేడమ్ దశ తిరుగుతున్నట్టుగానే కనిపిస్తోంది. పైగా ఇవన్నీ ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాయి. వీటిలో ముందుగా వస్తోన్న సినిమా బెదురులంక 2012.

కార్తికేయ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ మూవీకి కూడా రాధిక గ్లామర్ పెద్ద ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. సినిమా ట్రైలర్ కూడా ఓకే అనిపించుకుంది. కంటెంట్ కూడా ఆకట్టుకుంటే ఖచ్చితంగా బెదురులంక విజయం సాధించే అవకాశాలున్నాయి. పైగా ఈ మూవీ రాధికతో పాటు కార్తికేయకూ కీలకమే.


ఇక నెక్ట్స్ వస్తోన్న సినిమా రూల్స్ రంజన్. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ మూవీ నుంచి వచ్చిన ఓ పాట మాత్రం అదరగొట్టింది. అలాగే విశ్వక్ సేన్ తో సినిమా చేస్తోంది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి రీసెంట్ గా వచ్చిన సాంగ్ సినిమాకే హైలెట్ అనేలా ఉంది. ఈ పాటలో వీరి కెమిస్ట్రీ కూడా ఆకట్టుకునేలా ఉంది.

ఈ మూవీ 1990ల నేపథ్యంలో రూపొందిన సినిమా. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని సితార బ్యానర్ రూపొందిస్తోంది. ఆ బ్యానర్ కారణంగానే అమ్మడికి బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అంటున్నారు. మొత్తంగా ఈ మూడు సినిమాల్లో ఏ రెండు హిట్ అయినా.. రాధిక మేడమ్ దశ తిరుగుతుంది. నెక్ట్స్ లెవల్ హీరోల నుంచి ఆఫర్స్ వస్తాయనే ఆశతో ఉంది. మరి అలా జరుగుతుందా లేదా అనేది చూద్దాం.

Related Posts