హాస్టల్ బాయ్స్ ట్రైలర్ .. ఇంత క్రేజీగానా

యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ అనగానే అడల్ట్ కంటెంట్ అనుకుంటున్నారు. అఫ్‌ కోర్స్ అలా తయారు చేశారు మన మేకర్స్. బట్ కొన్నిసార్లు పాథ్ బ్రేకింగ్ లాంటి మూవీస్ వస్తాయి. అవి ఏ భాషలో వచ్చినా యూనిక్ కంటెంట్ ఉంటే అన్ని భాషల ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తాయి. అలా తెలుగులో హ్యాపీడేస్ వంటి సినిమాలా కన్నడలో కిరిక్ పార్టీ అనే సినిమా ఉంది.

అక్కడి నుంచి ఇన్నాళ్లకు మరో కాలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా వచ్చింది. హాస్టల్ హుడుగురు అనే టైటిల్ తో రూపొందిన ఈ మూవీ కన్నడలో బ్లాక్ బస్టర్ అయింది. ఆ చిత్రాన్ని తెలుగులో ఎవరైనా రీమేక్ చేస్తారేమో అని చాలామంది భయపడ్డారు. బట్ రీమేక్ కాకుండా డబ్ చేస్తున్నారు. బాయ్స్ హాస్టల్ అనే టైటిల్ తో ఈ నెల 26న తెలుగు వెర్షన్ విడుదల చేయబోతోన్న ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు..


టైటిల్ కు తగ్గట్టుగానే బాయ్స్ హాస్టల్ అంటే ఎలా ఉంటుందో అలాగే కనిపిస్తోందీ సినిమా. ముఖ్యంగా వార్డెన్ అంటే అందరికీ కోపమే ఉంటుంది. ఆ కోపంతోనే అతను ఓ మాట జారాడని ఏకంగా చేంపేస్తారు. అక్కడి నుంచి ఆ శవాన్ని మాయం చేయడానికి.. వారు పడే తిప్పలన్నీ హిలేరియస్ గా ఉన్నాయి. అలాగే హాస్టల్స్ ఇలా ఉండవు అంటూ మరో ట్విస్ట్ తో కొత్త కోణం స్టార్ట్ అవుతుంది. ఇదీ అంటే ఎంటర్టైనింగ్ గా ఉంది.

మొత్తంగా యూత్ ఫుల్ సినిమాగా కనిపిస్తోన్న ఈ ట్రైలర్ మాత్రం క్రేజీగా ఉందనే చెప్పాలి. పైగా డబ్బింగ్ అనే స్మెల్ అస్సలు కనిపించడం లేదు. దీంతో పాటు రష్మి ఓ సిజిలింగ్ రోల్ చేసింది. చివర్లో కాంతార హీరో, మన తెలుగు దర్శకుడు తరుణ్ భాస్కర్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇవి అదనంగా కలిసొస్తాయి.


ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ అందించిన సంగీతం హైలెట్ కాబోతోంది. మొత్తంగా హాస్టల్ బాయ్స్ అంటే ఎలాంటి సినిమా ఎక్స్ పెక్ట్ చేస్తారో అందకు కాస్త భిన్నంగా.. పూర్తి వినోదాత్మకంగా రూపొదినట్టు కనిపిస్తోన్న ఈ డబ్బింగ్ చిత్రంలో కూడా చివరికి కులాలను మిక్స్ చేయడం బాలేకున్నా.. ఓవరాల్ గా ట్రైలర్ మాత్రం భలే ఉంది.

Related Posts