కొటేషన్ గ్యాంగ్.. ఇంత వయెలెంట్ టీజర్ ఈ మధ్య చూడలేదు

టీజర్ సినిమాపై ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. అలాగే అది ఏ వర్గప్రేక్షకుల ఛాయిస్ అవుతుంది అనేది కూడా చెబుతుంది. కొన్ని టీజర్స్ మాత్రం భయపెడతాయి. ఆ భయం లో నుంచి కూడా ఖచ్చితంగా చూడాలి అనే ఆసక్తిని క్రియేట్ చేస్తాయి. అలాంటిదే ఈ టీజర్.

సినిమా పేరు కొటేషన్ గ్యాంగ్. తమిళ్ మూవీ. ఈ టీజర్ చూస్తే దీనికి భాషతో పనిలేదు అనిపిస్తుంది. అందుకే ప్యాన్ ఇండియన్ సినిమాగానే విడుదల చేస్తున్నారు. కొటేషన్ గ్యాంగ్ అనే టైటిల్ లోనే మేటర్ ఉంది. సుపారీలు తీసుకుని హత్యలు చేసే గ్యాంగ్స్ కు సంబంధించిన సినిమా అని. గ్యాంగ్స్ మధ్య వార్ అనుకోవచ్చు. దీనికి తోడు ఈ సినిమాలో ఉన్న ఆర్టిస్టులను చూస్తే ఖచ్చితంగా ఇది నెక్ట్స్ లెవల్ మూవీ అవుతుందనిపిస్తుంది.

జాకీ ష్రాఫ్‌, ప్రియమణి, సన్నిలియోన్, సారా అర్జున్ ఉన్నారు. వీరితో పాటు చాలా పాత్రలు కనిపిస్తున్నాయి. ఈ గ్యాంగ్ లో సభ్యులవడం అంత సులభం కాదు అనే వాయిస్ తో మొదలైన ఈ టీజర్ లో ఒక ఆటోలో వచ్చిన ప్రియమణి ఆయుధం తీసుకుని పదుల సంఖ్యలో ఉన్న గుంపుపై దాడి చేయడానికి వెళ్లడం బలే సీన్ అవుతుందనిపిస్తుంది. జాకీ ష్రాఫ్ కు షేవింగ్ చేస్తూ సన్నిలియోన్ అంటుంది.. ” ఒక గ్యాంగ్ లీడర్ మాత్రమే ఇంకొక గ్యాంగ్ లీడర్ ను చంపగలడు” అని. దానికి ” శివుని మెడలో ఉన్న పాము, డేగతోటి అంటుంది.. ఏం ఎలా ఉన్నావని.. దానికి కోపంతో డేగ సమాధానం ఇచ్చింది.. వగల మారీ నువ్వు నీ స్థానంలో ఉన్నంత వరకూ అందరూ బానే ఉంటారు అని.. ” అంటూ జాకీష్రాఫ్‌ చెప్పే డైలాగ్ మరో స్థాయిలో ఉంది. టైటిల్ తో పాటు టీజర్ లో ఉన్న కంటెంట్ ను బట్టి చూస్తే ఇది ఈ మధ్య కాలంలోనే ఎప్పుడూ లేనంత వయొలెన్స్ తో నిండి ఉన్న సినిమా అని అర్థం అవుతుంది.

కాకపోతే ప్రతి షాట్, విజువల్స్ అన్నీ అద్భుతం అనేలా ఉన్నాయి. ఈ తరహా మాస్ మూవీస్ ను ఇష్టపడే ఆడియన్స్ ను కొటేషన్ గ్యాంగ్ గ్యారెంటీగా ఎంటర్టైన్ చేస్తుందనిపిస్తుంది. ఇక టీజర్ లోనే ఈ వయొలెన్స్ ను చూశాక ఫ్యామిలీ ఆడియన్స్ కు అస్సలు రికమండ్ చేయలేం.


వివేక్ కుమార్ కన్నన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తమిళ్ లో గాయత్రి సురేష్‌, వివేక్ కుమార్ కన్నన్ నిర్మించారు. డ్రమ్మర్ గా ప్రపంచ వ్యాప్తంగా పేరున్న శివమణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఆయన ప్రభావం చాలా ఉంటుందని ఈ టీజర్ లోనే తెలుస్తోంది. అరుణ్‌ బద్మనాబన్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను ఇంకా అనౌన్స్ చేయలేదు.

Related Posts