ప్రాజెక్ట్ కే .. మతిపోయే బడ్జెట్

ఏ సినిమాకైనా బడ్జెట్ కీలకం. అయితే కథ డిమాండ్ చేస్తే ఎంత ఖర్చైనా చేసే నిర్మాతలు అరుదుగా ఉంటారు. ఆ విషయంలో యాభై యేళ్లుగా ముందే ఉంటున్నాడు నిర్మాత అశ్వనీదత్.

తన వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సొంత అల్లుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా రూపొందిస్తోన్న ప్రాజెక్ట్ కే సినిమా కోసం ఆయన ఓ రకంగా లైఫ్ రిస్క్ చేస్తున్నాడు అనే చెప్పాలి. ఆ రేంజ్ లో కనిపిస్తోందీ మూవీ బడ్జెట్.

ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ చూస్తే అవెంజర్స్ కు ఇండియన్ వెర్షన్ తయారు చేస్తున్నారు అనిపిస్తోంది. అంటే విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కు భారీగా ఉంటాయి. ఖర్చు కూడా అలాగే ఉంటుంది. దీనికి తోడు ఈ మూవీ కాస్టింగ్ కే సగానికి పైగా బడ్జెట్ కనిపిస్తోంది.


ఇక ఈ చిత్రానికి ప్రభాస్ కు ఇస్తోన్న రెమ్యూనరేషన్ 150 కోట్లు. లేటెస్ట్ గా వచ్చిన కమల్ హాసన్ కు 50 కోట్ల వరకూ ఇస్తున్నారని టాక్. అంటే ఇద్దరికే రెండు వందల కోట్లు అయ్యింది. దీపికా పదుకోణ్ 15 కోట్లు, అమితాబ్ కు 15కోట్లు, దిశా పఠానీకి 5 కోట్లు. ఈ ఐదుగురు ఆర్టిస్టులకే 235 కోట్ల బడ్జెట్ అవుతోంది. ఇంకా చాలామంది ఉంటారు కదా. దానికోసం మరో 20 కోట్ల వరకూ వేసుకున్నా.. ఓవరాల్ గా 255 కోట్లు రెమ్యూనరేషన్స్ కే వెళుతుంది.


ఇక ప్రొడక్షన్ కు అయ్యే ఖర్చు 400 కోట్లు అంటున్నారు. అంటే కేవలం మూవీ బడ్జెట్ కే 655 కోట్లు అవుతుంది. మరి ఈ రేంజ్ లో ఖర్చు పెడుతున్నప్పుడు రాబడి దానికి మూడొంతులకు పైగా లాభాలు ఆశిస్తారు కదా. మరి లాభాలు ఊరికే రావు కదా..? ఓ రేంజ్ కంటెంట్ ఉండాలి. ఇప్పటి వరకూ చూసిన హాలీవుడ్ మూవీస్ ప్రాజెక్ట్ కే ముందు బలాదూర్ అనేలా ఉండాలి.

Related Posts