ప్రేమ్ కుమార్ ట్రైలర్.. మరో కాన్సెప్టా ..?

సంతోష్ శోభన్.. ఒక్క హిట్ కోసం చకోర పక్షిలా చూస్తూనే ఉన్నాడు. వరుసగా సినిమాలైతే వస్తున్నాయి కానీ.. విజయం మాత్రం రావడం లేదు. అయినా అతని చేతినిండా సినిమాలుండటం విశేషం. రీసెంట్ గా వచ్చిన అన్నీ మంచి శకునములే విజయం తెస్తుందని చాలామంది భావించారు. బట్ అదో సీరియల్ గా తేల్చారు ఆడియన్స్.

పెద్ద గ్యాప్ లేకుండా ఇప్పుడు ప్రేమ్ కుమార్ అంటూ వస్తున్నాడు. అయితే సంతోష్‌ శోభన్ కెరీర్ లో ఎక్కువగా కాన్సెప్ట్ సినిమాలే ఉన్నాయి. అలా వచ్చిన ఫస్ట్ కాన్సెప్ట్ ఏక్ మినీ కథ ఎంటర్టైన్ చేసింది. దీంతో ఆ కాన్సెప్ట్ నే ఫాలో అవుతున్నాడు. బట్ లక్ లేదు. ఇక అతని కొత్త సినిమా ప్రేమ్ కుమార్ ట్రైలర్ చూస్తే ఇదీ ఓ కాన్సెప్ట్ తోనే వస్తున్నట్టు కనిపిస్తుంది.


ఎన్నిసార్లు పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించినా.. ఈ కుర్రాడికి తీరా పెళ్లి టైమ్ కు ఏదో ఒకటి అవుతుంటుంది. అలా ఎన్నో పెళ్లిళ్లు క్యాన్సిల్ అయిన తర్వాత అసలు పెళ్లే వద్దు అని పికే డిటక్టివ్ ఏజెన్సీ పెట్టుకుంటాడు. దీని ద్వారా.. పెళ్లి కాబోతోన్న, పెళ్లైన వారి సీక్రెట్స్ తెలుసుకుని ఆ పెళ్లిళ్లు ఆగిపోయేలా లేదా విడాకులుకు వెళ్లేలా చేస్తుంటాడు. ఈ క్రమంలో అతని లైఫ్‌ ఎన్ని మలుపులు తిరిగింది. చివరికి అసలు అతనికి పెళ్లైందా.. ఆ అమ్మాయి ఎవరు అనే కోణంలో ట్రైలర్ కనిపిస్తోంది. అఫ్‌ కోర్స్ సినిమా కూడా ఇదే కాన్సెప్ట్ తో రూపొందినట్టుగా ఉంది. ఇక ఈ చిత్రాన్ని ఆగస్ట్ 18న విడుదల చేయబోతున్నట్టు ఈ ట్రైలర్ తో పాటు అనౌన్స్ చేశారు.


సంతోష్‌ తో పాటు అతని సినిమాల్లో రెగ్యులర్ గా కనిపించే పాత్రలే ఉన్నాయి. హీరోయిన్ గా రాశి సింగ్ అన్నారు కానీ.. ఆ అమ్మాయి ట్రైలర్ లో ఎక్కడా ఎలివేట్ కాలేదు. అంత సర్ ప్రైజ్ ఏంటో కానీ.. హీరోయిన్ ను కూడా లైట్ తీసుకున్నారీ ట్రైలర్ లో. వీరితో పాటు ఓ రైజింగ్ హీరో కూడా ప్రేమ్ కుమార్ లైఫ్‌ లో ఉన్నాడు. అతని పాత్ర కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంది.


ఇక షారంగ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై శివ ప్రసాద్ పన్నీరు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అభిషేక్ మహర్షి దర్శకుడు. నిజానికి ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు అయితే ఓకే అనిపించుకుంటాయి. లేదంటే డిజాస్టర్ అవుతాయి తప్ప.. ఓ బ్లాక్ బస్టర్ గా మారవు. అయినా ఇలాంటి కాన్సెప్ట్ లే ఎందుకు నమ్ముకుంటున్నాడో కానీ..ఈ ప్రేమ్ కుమార్ అయినా.. సంతోష్ నిరీక్షణకు ఫుల్ స్టాప్ పెడతాడా లేదా అనేది చూడాలి.

Related Posts