HomeMoviesటాలీవుడ్ప్రాజెక్ట్ కే.. ప్రభాస్ తో పాటు రానా కూడానా..

ప్రాజెక్ట్ కే.. ప్రభాస్ తో పాటు రానా కూడానా..

-

ప్రాజెక్ట్ కే మేనియా స్టార్ట్ అయింది. ప్రభాస్ సరసన దీపికా పదుకోణ్‌ హీరోయిన్ గా నటిస్తుండగా.. అమితాబ్ కీలక పాత్రలో కమల్ హాసన్ విలన్ గా నటించబోతున్నారు. దిశా పటానీ ఓ కీలక పాత్ర చేస్తోంది. మల్టీవర్స్ నేపథ్యంలో రూపొందుతోంది అని ప్రస్తుతం చెప్పుకుంటోన్న ఈ మూవీకి సంబంధించి చాలా కథనాలే ప్రచారంలో ఉన్నాయి.

ముఖ్యంగా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ మాత్రం అందరికీ కనెక్ట్ అవుతోంది. అంటే టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వివిధ గ్రహాలకు వెళ్లే హీరో మన గ్రహానికి ఆపద పొంచి ఉందని తెలిసి.. మానవాళిని కాపాడేందుకు తన హీరోయిన్ తో కలిసి ఓ సూపర్ హీరోలా అవతరిస్తాడు. ఈ తరహాలో ఇప్పటికే హాలీవుడ్ లో చాలా సినిమాలే వచ్చినా.. దీనికి ఇండియన్ మైథలాజికల్ టచ్ కూడా ఉంటుందనే పాయింట్ అందరినీ ఆకట్టుకుంటోంది.

2024 సంక్రాంతి బరిలో విడుదల కాబోతోన్న ప్రాజెక్ట్ కే ప్రస్తుతం ఇండియాస్ మోస్ట్ అవెయిటెడ్ మూవీగా మారింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో అశ్వనీదత్ నిర్మిస్తోన్న ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తుందంటున్నారు. అందుకే ఏకంగా 800 కోట్ల బడ్జెట్ ను కేటాయించారట. ఇదీ ఓ రికార్డ్ గానే చెప్పొచ్చు.


ఇక ఈ 20న యూఎస్ లోని శాండియాగోలో కామిక్ కాన్ 2023 ఫెస్ట్ లో ఈ మూవీ టైటిల్ తో పాటు ట్రైలర్ ను కూడా విడుదల చేయబోతున్నారు. అయితే ఈ ట్రైలర్ మనకు 21న వస్తుంది. ఇప్పటికే ఈ వేడుక కోసం మెయిన్ టీమ్ యూఎస్ కు వెళ్లింది.

అయితే లేటెస్ట్ గా ప్రభాస్ అక్కడ లాండ్ అయ్యాడు. అందులో ఆశ్చర్యం లేదు. కానీ ప్రభాస్ తో పాటు రానా కూడా వెళ్లాడు. ఈ ట్రైలర్ లాంచింగ్ కోసం సినిమాలో నటిస్తోన్న దీపికా పదుకోణ్, కమల్ హాసన్ కూడా హాజరు కాబోతున్నారు. వాళ్లంటే సినిమాలో నటిస్తున్నారు కాబట్టి వెళ్లారు.

మరి రానా ఎందుకు వెళ్లాడు అంటే.. ప్రభాస్ తో అతనికి ఉన్న స్నేహం వల్ల. అది మాత్రమే కాదు.. రానా కూడా ఈ చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించబోతున్నాడు అనే టాక్ ఉంది. అందుకే అతను కూడా ప్రాజెక్ట్ కే లోగో ఉన్న హుడీ వేసుకుని ఉన్నాడు.

బాహుబలి తర్వాత వీళ్లు కలిసి నటించలేదు. దీంతో ఈ మూవీలో చిన్న సీన్ అయినా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుందనుకోవచ్చు. మరి రానా ఏ పాత్రలో కనిపిస్తాడు అనేది తర్వాత తెలుస్తుంది. బట్ ఇప్పటికి మాత్రం ప్రాజెక్ట్ కే మేనియా హై ఫేజ్ లో ఉందనే చెప్పాలి.

ఇవీ చదవండి

English News