ప్రభాస్ ఆల్ టైమ్ రికార్డ్

బాక్సాఫీస్ బుల్డోజర్ ప్రభాస్ సినిమా అంటే ఇండియా మొత్తం షేక్ అయిపోతుంది. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్‌ చిత్రాలు పోయినా.. డార్లింగ్ ఛరిష్మా తగ్గలేదు. తగ్గదు కూడా అనేలా అతని రేంజ్ రోజు రోజుకూ పెరుగుతూ పోతోంది. ముఖ్యంగా ఆదిపురుష్ బాగా నిరాశపరిచింది.

దీని ఎఫెక్ట్ నెక్ట్స్ మూవీ సలార్ బిజినెస్ పై పడుతుందేమో కొంతమంది విశ్లేషించారు. బట్ అలాంటిదేం లేదని ఈ మూవీ బిజనెస్ కు వస్తోన్న హైప్ చూస్తే అర్థం అవుతుంది. ఇక వీటికి తోడు సలార్ మరో కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రిలీజ్ కు ముందే రికార్డ్స్ అంటే అభిమానులకు ఆ కిక్కే వేరు కదా..? ఇంతకీ ఆ రికార్డ్ ఏంటో తెలుసా..


ఇండియాలో రిలీజ్ అయ్యే చాలా సినిమాలు ఒకరోజు ముందే యూఎస్ఏలో రిలీజ్ అవుతాయి. ఆ రకంగా కొంతమందికి ముందే రివ్యూస్ కూడా తెలుస్తాయి. స్టార్ హీరోల విషయంలో ఎన్ని థియేటర్స్, ఎన్ని లొకేషన్స్ లో రిలీజ్ చేశారు అనే కాలిక్యులేషన్ ను బట్టి వారి స్టార్డమ్ లెక్కవేస్తారు కూడా. అలా చూస్తే ప్రభాస్ సినిమా విడుదల కాబోతోన్న లొకేషన్స్ చూస్తే కళ్లు తిరగడం ఖాయం.


ఈ సలార్ చిత్రాన్ని సెప్టెంబర్ 27నే యూఎస్ఏలో ఏకంగా 1979 లొకేషన్స్ లో విడుదల చేయబోతున్నారట. అది కూడా కేవలం నార్త్ అమెరికాలోనే. అంటే ఆయా లొకేషన్స్ లో ఎన్ని థియేటర్స్ లో వస్తుందనేది తర్వాత తెలుస్తుంది. బట్.. అసలు అన్ని ప్రాంతాల్లో ఇప్పటి వరకూ ఏ ఇండియన్ సినిమా కూడా విడుదల కాలేదు. దానికి దగ్గరలో కూడా ఏ సినిమా లేదు.

ప్రత్యంగిర సినిమాస్ వాళ్లు ఈ చిత్రాన్ని అక్కడ విడుదల చేస్తున్నారు. ఈ మేరకు వాళ్లే లేటెస్ట్ గా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. సో.. సినిమా ఏ మాత్రం హిట్ టాక్ తెచ్చుకున్నా.. అక్కడ మొదటి రోజే టూ మిలియన్ క్లబ్ లో చేరినా ఆశ్చర్యం లేదు. అంటే ఆ రికార్డ్స్ ను తిరగరాయాలంటే మళ్లీ ఎన్నేళ్లు పడుతుందో.. ఎవరికి సాధ్యం అవుతుందో కానీ.. నిజంగానే ప్రభాస్ బాక్సాఫీస్ బుల్డోజర్ అయిపోయాడు.

Related Posts