‘గామి’ చాందినీ లుక్‌ రిలీజ్‌

ఈ మధ్య కాలంలో అత్యంత ఆసక్తి రేకెత్తించిన సినిమాల్లో గామి ఒకటి. విశ్వక్‌సేన్‌ అఘోరా పాత్ర పోషిస్తున్నాడనగానే అన్ని వర్గాల్లో క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది. టైటిల్‌ అనౌన్స్‌మెంట్ నుంచి పోస్టర్‌ లాంచ్, గ్లింప్స్, లిరికల్ సాంగ్స్ .. ఇలా అన్నింటా ఆకట్టుకుంటోంది గామి. ఇప్పుడు హీరోయిన్ చాందిని చౌదరి లుక్ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది.
కార్తీక్‌ శబరీష్ నిర్మాణంలో వి సెల్యూలాయిడ్‌, క్రౌడ్ ఫండ్‌ సహకారంతో విద్యాధర్‌ కాగిత డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా లో చాందిని పాత్రను జాహ్నవిగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. మార్చి 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Posts