ఖమ్మంలో సినిమా థియేటర్స్ కు టిడిపి వార్నింగ్

ఖమ్మం జిల్లాలో కొత్త సంఘటన చోటు చేసుకుంటోంది. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం సినిమాను ఖమ్మం జిల్లా థియేటర్స్ లో ప్రదర్శిస్తే థియేటర్లను ముట్టడి చేస్తామని ఆ పార్టీకి చెందిన నేతలు బహిరంగంగా హెచ్చరికలు చేస్తున్నారు.

నున్నా నవీన్ చౌదని అనే వ్యక్తి పేరుతో వాట్సాప్ గ్రూపుల్లో సర్కిలేట్ అవుతున్న ఈ వార్నింగ్ హాట్ టాపిక్ గా మారింది..


“ఖమ్మం జిల్లా థియేటర్ యాజమాన్య అసోసియేషన్ మరియు డిస్ట్రిబ్యూటర్లకు తెలుగుదేశం పార్టీ వారి విజ్ఞప్తి….
మా అధినాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినేత
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్య శ్రీ
Nara Chandrababu Naidu గారిని విమర్శిస్తూ
వివాదాస్పద దర్శకుడు #రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న “వ్యూహం” సినిమా ఖమ్మం జిల్లాలోని థియేటర్ లలో ప్రదర్శిస్తే ఆ సినిమా థియేటర్ లను ముట్టడిచేస్తామని తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంటు మరియు తెలుగుయువత తరుపున హెచ్చరిస్తున్నాము ✊

మీ
నున్నా నవీన్ చౌదరి
తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంటు
తెలుగుయువత ఖమ్మం పార్లమెంటు.. “

ఇదీ ప్రస్తుతం వాట్సాప్ గ్రూపుల్లో సర్కిలేట్ అవుతున్న న్యూస్. నిజానికి థియేటర్స్ ను ముట్టడి చేయడం నేరం కిందికే వస్తుంది. ఎందుకంటే ఏ సినిమా అయినా సెన్సార్ అయిన తర్వాతే రిలీజ్ అవుతుంది. వీళ్లు కావాలనుకుంటే సెన్సార్ బోర్డ్ ను ముట్టడించి సినిమా విడుదలను ఆపే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఒక్కసారి సెన్సార్ అనుమతి వచ్చింది అంటే చట్టబద్దంగా ఉన్నట్టే. అలాంటి సినిమాను థియేటర్స్ లో అడ్డుకుంటే చట్ట వ్యతిరేక కార్యకలాపమే అవుతుంది. కాకపోతే ఇలాంటి వార్తలతో చోటామోటా నాయకులు కాస్త ఫేమ్ అవుతారు అంతే తప్ప ఒరిజినల్ ఉపయోగం ఉండదు.దీనికి వర్మ కూడా.. కావాలంటే మీరూ ఓ సినిమా తీసుకోండి అంటున్నాడు. ఆ ప్రయత్నం చేయొచ్చు. కానీ థియేటర్స్ ను ముట్టడిస్తే ప్రజలుఆ సినిమాను చూడకుండా కట్టడి చేయగలరా.. అది సాధ్యమేనా.. ?

Related Posts