అన్నతో పంచాయితీ.. తమ్ముడికి ప్రశంసలు

యాంకర్ నుంచి యాక్ట్రెస్ అయిన బ్యూటీ అనసూయ. తనపై ఎన్ని కమెంట్స్ వచ్చినా.. సెటైర్స్ పడినా నా రూటే సెపరేట్ అంటూ దూసుకుపోతుంది. బుల్లితెరపై మొదటిసారిగా అందాల మోతను ఆరంభించి ఆ ఆ రేంజ్ కే అందరూ వెళ్లేలా చేసిన ట్రెండ్ సెట్టర్ అనసూయ.

నటిగా సెలెక్టెడ్ రోల్స్ చేస్తూ.. చేసిన పాత్రలు రిపీట్ కాకుండా చూసుకుంటోన్న ఈ బ్యూటీ కొన్నాళ్ల క్రితం విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి మూవీకి సంబంధించి అతనితో గిల్లికజ్జాలు పెట్టుకుంది. అఫ్ కోర్స్ ఆ టైమ్ లో చాలామంది విజయ్ ని విమర్శించినా.. ఎందుకో అనసూయ విమర్శలను అతని ఫ్యాన్స్ తీసుకోలేకపోయారు. దీంతో అప్పటి నుంచి వీరి మద్య వార్ స్టార్ట్ అయింది.

సినిమాలో మ్యూట్ చేసిన డైలాగ్స్ ను విజయ్ దేవరకొండ ఓ కాలేజ్ ఫంక్షన్ లో ఓపెన్ గా చెప్పాడు.. ఇదేం సంస్కారం అనేది అప్పట్లో అనసూయ పాయింట్. పాయింట్ మంచిదే. కానీ పొట్టి బట్టలు వేసుకునే నువ్వేంది మాకు చెప్పేది అంటూ విజయ్ ఫ్యాన్స్ కౌంటర్స్ వేశారు. అప్పటి నుంచీ రగులుతూనే వుందీ వ్యవహారం.

రీసెంట్ గా విజయ్ దేవరకొండ తన పేరుకు ముందు ‘ద విజయ్ దేవరకొండ’ అని పెట్టుకున్నాడు. అప్పుడే ‘ద’ అని పెట్టుకునేంత పెద్ద స్టార్ అయ్యాడా..? ఇప్పటి వరకూ అమితాబ్, రజినీకాంత్, చిరంజీవి లాంటి వాళ్లే పెట్టుకోలేదు అంటూ మళ్లీ గిల్లింది. దీంతో కొన్ని రోజులు ఆ రచ్చ కూడా నడిచింది.

అయితే ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాను అని ఆ మధ్య విమానం మూవీ ప్రెస్ మీట్స్ లో చెప్పింది. అందుకేనేమో.. అప్పుడు అన్నతో పంచాయితీ పెట్టుకున్న అనసూయ ఇప్పుడు తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమాపై ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు ఆనంద్ లేటెస్ట్ మూవీ బేబీ ట్రైలర్ పై తన ఒపీనియన్ ను ట్విట్టర్ లో పెట్టింది.


” ఈ పార్టీకి ఆలస్యం అయ్యాను. అయినా అసలే లేకపోవడం కంటే ఆలస్యం బెటర్ కదా.. ఈ హార్డ్ హిట్టింగ్ ట్రైలర్ కు ప్రేమలో పడిపోయాను. ప్రతి లైన్ ఒరిజినల్ గా ఉంది. నాకు తెలిసిన వాళ్ల కథలానే అనిపిస్తుంది. సినిమా కోసం ఇంక ఆగలేకపోతున్నాను. థ్యాంక్యూ సాయి రాజేశ్..” అంటూ డైరెక్టర్ ను ట్యాగ్ చేసింది.

దీంతో అన్నతో గొడవలు.. తమ్ముడి సినిమాకు ప్రశంసలు అంటే.. ఇక అనసూయ .. విజయ్ దేవరకొండతో గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టబోతోందా అనుకుంటున్నారు. అన్నట్టు.. ఈ ట్వీట్ లో ఎక్కడా ఆవిడ ఆనంద్ గురించి మాట్లాడలేదు మరి.

Related Posts