మిస్టర్ శెట్టికి లక్ తెచ్చిన లేడీ వచ్చేసింది

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికీ విపరీతంగా నచ్చిన టైటిల్స్ లో ఒకటి. దాని తర్వాత కాంబినేషన్ కు మంచి క్రేజ్ వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత స్వీటీ బ్యూటీ అనుష్క, జాతిరత్నాలుతో ఫేమ్ అయిన నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ సినిమాకు పి మహేష్‌ బాబు దర్శకుడు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించిన ఈ మూవీ నుంచి లేటెస్ట్ గా మరో పాట విడుదలైంది. ఆల్రెడీ లేడీ లేడీ లక్కు అనే పేరుతో ప్రోమో వదిలారు. తాజాగా ఈ సినిమా విడుదల కాబోతోన్న నాలుగు భాషల్లోనూ ఒకేసారి ఈ పాటను విడుదల చేశారు.


“ఎందుకంత ఇష్టం నేనంటే.. ఎందులోన గొప్ప నేను నీకంటే.. ఎంత ఎంత నచ్చుతుందో.. నీ పెదాలు నన్ను మెచ్చుకుంటే.. అదెందుకంటే అందుకే అదంతే.. ఆల్ ద బెస్ పలికే అందమైన కళ్లు.. నాలో కాంతి నింపుతున్నవి.. ఫౌంటైన్ లా పొంగుతున్నది సెల్ఫ్ కాన్ఫిడెన్స్.. నువ్వొచ్చినాకే మొదలైయాయి జిందగీలో హ్యాపీ డేస్.. లేడీ లక్కు లేడీ లక్కు నువ్వే.. నా లేడీ లక్కు నువ్వే .. “అంటూ రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ గీతాన్ని చాలా అందంగా పాడాడు కార్తీక్. ఇక ఈ చిత్రానికి రధన్ సంగీతం అందించాడు.


సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉన్న ఓ కుర్రాడికి సపోర్ట్ గా నిలిచి.. అతని కెరీర్ లో పైకి ఎదిగేందుకు సాయం చేసిన లేడీతోనే ఆ కుర్రాడు ప్రేమలో పడితే.. తన లైఫ్ లో ఆమె చేసిన మ్యాజిక్స్ ను తలచుకుంటూ ఓ పాట పాడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందీ సాంగ్. విశేషం ఏంటంటే.. ఇది లిరికల్ సాంగ్ కాదు. పూర్తి వీడియో సాంగ్. పాటలో అనుష్క ఎప్పట్లానే చార్మింగ్ గా ఉంది. నవీన్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. చూస్తోంటే ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా కనిపిస్తోందీ మూవీ. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో ఆగస్ట్ 4న విడుదల కాబోతోంది ఈ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ.

Related Posts