‘నువ్వే రావా రావా..’ అంటోన్న ‘గీతాంజలి’

‘నువ్వే రావా రావా.. నా మది చేరా చేరా..’ అంటూ క్లాసికల్ డ్యాన్స్ తో మెస్మరైజ్ చేస్తుంది గీతాంజలి.. అంజలి. ఏప్రిల్ 11న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోన్న ‘గీతాంజలి’ సీక్వెల్ ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ప్రమోషన్స్ లో స్పీడు పెంచింది టీమ్. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో అందరి అటెన్షన్ ను సంపాదించిన ‘గీతాంజలి 2’ నుంచి లేటెస్ట్ గా ‘నువ్వే రావా రావా..’ అంటూ సాగే గీతం విడుదలైంది.

ఈ పాటలో క్లాసికల్ డ్యాన్స్ తో అంజలి అదరగొట్టబోతున్నట్టు అర్థమవుతోంది. ప్రవీణ్ లక్కరాజు సంగీతంలో శ్రీజో రాసిన ఈ గీతాన్ని రమ్య బెహరా, ఆదిత్య అయ్యంగార్ ఆలపించారు

Related Posts