HomeMoviesటాలీవుడ్తెలుగు చిత్ర పరిశ్రమకు మరో మహిళా దర్శకురాలు

తెలుగు చిత్ర పరిశ్రమకు మరో మహిళా దర్శకురాలు

-

తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు లేడీ డైరెక్టర్స్ పెరుగుతున్నారు. భానుమతి, సావిత్రి, విజయనిర్మల వంటి నాటితరం నటీమణులు దర్శకులుగానూ సత్తా చాటారు. ఆ తర్వాత చాన్నాళ్లకు బి.జయ, జీవిత వంటి వారు మెగా ఫోన్ పట్టి డైరెక్టర్స్ గా తామేమీ తక్కువ కాదని నిరూపించారు. ఈ జనరేషన్ లో నందిని రెడ్డి, లక్ష్మీ సౌజన్య, గౌరీ రోనంకి వంటి వారు దర్శకులుగా ముందుగా సాగుతున్నారు. ఈకోవలోనే.. ఇప్పుడు ఓ ఆర్.జె. దర్శకురాలిగా పరిచయమవుతోంది.

ఆర్.జె గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, అడ్వర్ టైజ్ మెంట్స్ కంటెంట్ రైటర్ గా పనిచేస్తున్న శ్వేత ఇప్పుడు దర్శకురాలిగా మారుతోంది. అది కూడా డెబ్యూ డైరెక్టర్స్ కి అడ్డాగా నిలిచే బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ లో. యష్ రంగినేని ప్రొడక్షన్ హౌస్ బిగ్ బెన్ సినిమా నుంచి ‘పెళ్లి చూపులు’తో తరుణ్ భాస్కర్, ‘డియర్ కామ్రేడ్’తో భరత్ కమ్మ, ‘దొరసాని’తో కె.వి.ఆర్.మహేంద్ర, ‘ఎ.బి.సి.డి’ సినిమాతో సంజీవ్ రెడ్డి, ‘భాగ్ సాలే’తో ప్రణీత్, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’తో చందు ముద్దు వంటి దర్శకులు పరిచయమయ్యారు.

ఇప్పుడు ఈ ప్రొడక్షన్ హౌజ్ నుంచి రాబోయే కొత్త సినిమాకి ఆర్.జె.శ్వేత దర్శకత్వం వహించబోతుందట. ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనుందట టీమ్.

ఇవీ చదవండి

English News