లంబసింగి చిత్రం సక్సెస్‌ మీట్‌

సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు సినిమాలతో బ్లాక్‌ బస్టర్ హిట్స్ సాధించిన కళ్యాణ్ కృష్ణ నిర్మాణంలో దిగి నవీన్‌గాంధీ డైరెక్షన్‌లో.. భరత్‌ రాజ్‌ , దివి మెయిన్ లీడ్ గా వచ్చిన మూవీ లంబసింగి. ఈ సినిమా మార్చి 15 న రిలీజై మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా సక్సెస్‌ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్.
నేను ఒక దర్శకుడిగా ఉండి ఇంకో దర్శకుడితో సినిమా చెయ్యడానికి కారణం ఏంటంటే… టాలెంట్ ఉండి కూడా అవకాశాలు రాక చాలా మంది ఉంటారు, నేను కూడా అలా అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాను అందుచేత నేను కొందరికి అవకాశం ఇద్దామని సినిమా నిర్మాణంలో అడుగు పెట్టాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు డైరెక్షన్ చెయ్యడానికి ఏడేళ్లు
వెయిట్ చేశారు, ప్రతిరోజు రేపే షూటింగ్ అనుకుంటూ గడిపే నాకు నాగార్జున గారూ నాకు అవకాశం ఇచ్చారు, ఆయనకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. దివి లాంటి చాలా మంది తెలుగు అమ్మాయిలు ఉన్నారు అందరికి అవకాశాలు రావాలి దివి ఈ సినిమాలో అద్భుతంగా నటించింది, భారత్ రాజ్ కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడన్నారు లంబసింగి నిర్మాత కళ్యాణ్‌ కృష్ణ.


ఈ కథ రాసినప్పుడు నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఇప్పుడు ప్రేక్షకులు అదే బరువైన హృదయంతో బయటికి వస్తున్నారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ గారు నన్ను నమ్మి ఈ సినిమా చేసినందుకు ధన్యవాదాలు. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన జీ.కె.మోహన్ గారికి థాంక్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ , మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్, ఆర్ట్ ఝాన్సీ ఇలా అందరూ వారి బెస్ట్ ఇచ్చారు. దివి, భారత్ చాలా ఇంటెన్స్ తో నటించాని, మా లంబసింగి సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు దర్శకుడు నవీన్‌ గాంధీ.
కళ్యాణ్ కృష్ణ గారు ఒక తెలుగు అమ్మాయి కావాలని నన్ను ఈ సినిమాకు తీసుకోవడం నాకు చాలా ఆనందమేసింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ్ గారికి స్పెషల్ థాంక్స్, తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వండి, గుర్తించండి, మేము కూడా కష్టపడతాము, నవీన్ గాంధీ గారు సినిమాను అద్భుతంగా తీశారు. రెస్పాన్స్ బాగుందని అన్నారు హీరోయిన్ దివి.


ళ్యాణ్ కృష్ణ గారి దర్శకత్వంలో ఒక చిన్న రోల్ చెయ్యాలని అనుకున్నాను. అలాంటిది ఆయన నిర్మాతగా చేసే సినిమాలో లీడ్ రోల్ చెయ్యడం చాలా సంతోషంగా ఉంది. సినిమాలో మ్యూజిక్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, క్రెడిట్ మొత్తం ఆర్.ఆర్.ధ్రువన్ గారికి చెందుతుంది, నవీన్ గాంధీ గారు సినిమాను తీసిన విధానం చాలా బాగుందన్నారు హీరో భరత్ రాజ్.

Related Posts