‘ఇన్‌స్పెక్టర్‌ రిషి’ వెబ్‌సిరీస్ ట్రైలర్‌ను సోషల్‌మీడియాలో షేర్ చేసిన కాజల్‌ అగర్వాల్

నవీన్‌ చంద్ర లీడ్‌ రోల్ చేస్తున్న తమిళ్ వెబ్‌సిరీస్‌ ‘ఇన్‌స్పెక్టర్‌ రిషి’. మేక్ బిలీవ్ ప్రొడక్షన్స్ పై సుఖ్ దేవ్ లాహిరి నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌కు నందిని జె.ఎస్ డైరెక్టర్‌. హర్రర్‌ కథాంశంతో తెరకెక్కిన అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఒరిజినల్ సిరీస్‌ గా ఈ వెబ్‌సిరీస్‌ మార్చి 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది. రీసెంట్ గా రిలీజయిన ట్రైలర్‌ నెట్టింట వైరల్ అవుతోంది. మంచి వ్యూస్‌ తో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది.

తీన్‌ కాడు ప్రాంతంలో వరుసహత్యల నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్‌ చేయడానికి వచ్చిన పోలీసాఫీసర్‌ రిషి పాత్రను పోషించాడు నవీన్‌ చంద్ర. దెయ్యమే ఆ హత్యలు చేస్తుందని నమ్మే జనం ఉన్న ప్రాంతంలో ఇన్‌స్పెక్టర్‌ రిషి ఎంటరయి ఆ హత్యల తాలూకూ మిస్టరీని ఎలా ఛేదించాడనేది ఈ వెబ్‌సిరీస్ కథాంశం.

నవీన్ చంద్ర, కాజల్ అగర్వాల్‌ నటిస్తున్న ‘సత్యభామ’ సినిమా సెట్‌లో ఈ ట్రైలర్‌ చూసిన కాజల్ ఇంప్రెస్‌ అయి సోషల్ మీడియాలో షేర్ చేసారు. నవీన్‌ చంద్రను , ఇన్‌స్పెక్టర్‌ రిషి వెబ్‌సిరీస్ టీమ్‌ను మెచ్చుకున్నారు.

Related Posts