మరో వివాదంలో షారుక్‌

బాలీవుడ్ బాద్‌షా..షారుక్‌ఖాన్‌ మరో వివాదంలో చిక్కుకున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శనివారం జరిగిన ఐపిఎల్ 2024 మ్యాచ్ సందర్భంగా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో పొగతాగినట్లు కొన్ని సోషల్ మీడియా పోస్ట్‌లు రావడంతో కాంట్రవర్శీ క్రియేట్ అయ్యింది. స్టేడియం VIP బాక్స్ లోపల SRK ధూమపానం చేస్తున్న ఫోటోలు, వీడియోలు ఉన్నాయి.

ఈ వీడియో కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న నేపథ్యంలో ఒత్తిడి కారణంగా షారుక్‌ఖాన్‌ స్మోక్ చేసి ఉండవచ్చంటున్నారు విమర్శకులు. ఆ సమయంలో అతని మేనేజర్ పూజా దద్లానీ కూడా అతని పక్కనే కనిపించారు. స్మోక్ చేస్తున్న షారుక్‌ విజువల్‌ని చూపించకుండా ఉండాల్సిందని ఒకరు, ఇలా పబ్లిక్ గా స్మోక్ చేసే షారుక్‌ ను ఏ స్టేడియంలోకి అనుమతించకుండా బిసిసిఐ బ్యాన్ చేయాలంటూ మరొకరు.. ఇలా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related Posts