తెలుగు ఇండస్ట్రీ నుంచి 1988లో ‘దాసి’ సినిమాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్‌గా జాతీయ అవార్డు దక్కించుకున్న సుదర్శన్ (73) మరణించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సుదర్శన్ వృత్తిరీత్యా నాగార్జున్ సాగర్ లోని హిల్ కాలనీ లోని ప్రభుత్వ కళాశాలలో డ్రాయింగ్ టీచర్‌గా జర్నీని ప్రారంభించారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సోమవారం రాత్రి కన్ను మూశారు. సుదర్శన్ అంత్యక్రియలు ఈవాళ మిర్యాలగూడలో నిర్వహించనున్నారు..