‘ఆయ్.. మేం ఫ్రెండ్సండి‘ అంటోన్న నార్నే నితిన్

ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా తన సెకండ్ మూవీతో వచ్చేస్తున్నాడు. డెబ్యూ మూవీ ‘మ్యాడ్‘తో మంచి హిట్ అందుకున్న నితిన్.. ఇప్పుడు ప్రతిష్ఠాత్మక గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లో తన రెండో చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ కి జోడీగా నయన్ సారిక నటిస్తుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ సినిమాకి అంజి కంచిపల్లి దర్శకుడు. లేటెస్ట్ గా ఈ మూవీకి ‘ఆయ్‘ అనే అచ్చమైన గోదావరి టైటిల్ ను ఖరారు చేశారు. ‘మేం ఫ్రెండ్సండి‘ అనేది ట్యాగ్ లైన్. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోని ఆసక్తికరంగా తీర్చిదిద్ది విడుదల చేసింది టీమ్. వేసవి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related Posts