‘డబుల్ ఇస్మార్ట్‘ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్‘. ఇప్పటికే సూపర్ డూపర్ హిట్టైన ‘ఇస్మార్ట్ శంకర్‘కి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతోంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా ఇది. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మీ కూడా ఈ సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్ కు చేరుకున్న ‘డబుల్ ఇస్మార్ట్‘ నుంచి టీజర్ రాబోతుంది.

మే 15న రామ్ బర్త్ డే స్పెషల్ గా ‘డబుల్ ఇస్మార్ట్‘ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. అందుకు సంబంధించి ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. దిమాకీకిరికిరి అంటూ రామ్ కొత్త అవతార్ లో సందడి చేస్తున్న ఈ టీజర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ డిఫరెంట్ గా ఉంది. ఈ సినిమాలో బాలీవుడ్ వెటరన్ యాక్టర్ సంజయ్ దత్ మరో కీ రోల్ లో కనువిందు చేయబోతున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్‘ని మ్యూజికల్ గా మరో లెవెల్ లో నిలబెట్టిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో పలు భాషల్లో ‘డబుల్ ఇస్మార్ట్‘ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts