ఇతర భాషలకు విస్తరిస్తున్న ‘మైత్రీ మూవీ మేకర్స్‌’

మైత్రీ మూవీ మేకర్స్. టాలీవుడ్ లో వన్‌ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫిల్మ్‌ ప్రొడ్యూస్ చేసే కంపెనీ. అల్లు అర్జున్ తో పుష్ప 2 ది రూల్, రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న RC16 సహా పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్ తో సినిమాలు నిర్మిస్తున్నారు. తెలుగు సినిమా పాన్ ఇండియా మార్కెట్‌ కు విస్తరించినట్టే..

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ కూడా పాన్ ఇండియా వ్యాప్తంగా విస్తరించడానికి సన్నాహాలు చేస్తోంది. తెలుగుతో పాటు తమిళ, మళయాళ, కన్నడ, హిందీ భాషల్లో తమ వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే మలయాళంలో అదృశ్య జలకంగల్ సినిమాను నిర్మించారు మైత్రి మూవీ మేకర్స్. టోవినో థామస్ ఇందులో హీరో. ఇక తమిళంలో అజిత్, అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌లో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ప్రకటించారు మైత్రి మూవీ మేకర్స్.

అజిత్ సినిమాను 200 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు మైత్రి మూవీ మేకర్స్. 2025 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. మరోవైపు హిందీలోనూ ఈ మద్యే ఫర్రే సినిమాను నిర్మించారు మైత్రి మూవీ మేకర్స్.
తెలుగులో అల్లు అరవింద్ , అశ్వినీదత్‌లు ఇలా ఇతర భాషల్లో ఎప్పటినుంచో సినిమాలు నిర్మిస్తున్నారు. రీసెంట్ గా దిల్‌రాజు పాన్ ఇండియా భాషల్లో నిర్మాణం చేపట్టారు. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్‌ ఇతర భాషల్లో సినిమా నిర్మాణం పై ఫోకస్ చేస్తోంది.

Related Posts