మెగాప్రిన్స్‌ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌

మెగాప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌, మానుషి చిల్లర్‌ మెయిన్‌లీడ్‌గా.. పుల్వామా దాడి ఘటన బ్యాక్‌డ్రాప్ తో ఎయిర్‌ ఫోర్స్‌ సాహసాలతో.. శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా డైరెక్షన్‌లో సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించిన మూవీ ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌ ‘. ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా గ్రాండ్ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మెగా కుటుంబంలో… ఏ హీరో సినిమా రిలీజయినా వెల్లువెత్తే ఉత్సాహంతో కదిలివచ్చే అభిమానులకు అభివాదం చేసారు మెగాస్టార్ చిరంజీవి. దేశానికి కాపలా కాసే రియల్‌ హీరోల గురించి మీరు చెబితే రీచ్ బావుంటుందని వరుణ్ తేజ్‌ చెప్తే.. అది నా అదృష్టంగా భావిస్తూ వచ్చానన్నారు మెగాస్టార్‌. పుల్వామా దాడి ఘటనలో అమరులైన జవాన్లకు నివాళి అర్పిస్తూ.. ఫిబ్రవరి 14న సర్జికల్ స్ట్రైక్స్ చేసిన నేపథ్యమే ఈ సినిమా. అందుకే ఆపరేషన్‌ వాలెంటైన్ అని పేరు పెట్టారన్నారు. దర్శకుడు శక్తి ప్రతాప్‌ సింగ్ ఐదులక్షల ఖర్చుతో సర్జికల్ స్ట్రైక్స్ పేరుతో షార్ట్‌ పిలిం తీస్తే.. అది చూసి అధికారులు అధిక ఇన్‌ఫర్మేషన్‌ మేమిస్తాము సినిమా తీయండంటూ ప్రోత్సాహించారన్నారు చిరు. ఈ చిత్రాన్ని 75 రోజుల్లో చిత్రీకరించారు. రిజనబుల్ బడ్జెట్‌లో ఇలాంటి విజువల్స్‌, రిచ్ నెస్ ఇవ్వడం ఆషామాషీ విషయం కాదు. ఆ విషయంలో సినిమా విడుదలకు ముందే దర్శకుడు శక్తి సక్సెస్‌ అయ్యారు. దీన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. నవదీప్‌ మా కుటుంబ సభ్యుడిలాంటివాడు. రామ్‌ చరణ్‌ ‘ధ్రువ’ సినిమాలోని తన నటన నాకు ఇష్టం. ఇందులోనూ మంచి పాత్ర పోషించాడు. ఈ చిత్రంలో నటించిన మిగతా నటీనటులు, టెక్నిషియన్స్‌ ని మెచ్చుకుంటూ సినిమా విజయాన్ని కాంక్షించారు చిరు.

దేశ సరిహద్దుల్లో సైనికులు బావుండాలని మా అమ్మ ప్రార్ధిస్తుంది.. మా అమ్మ వాళ్ల నాన్న, పెదనాన్నలు మిలటరీలో పనిచేసారు అని చెప్పారు నాగబాబు. 1965 నాటి భారత్‌ పాక్ యుద్దం గురించి, ఎయిర్‌ఫోర్స్ వీరత్వం గురించి చెప్పారు మెగాబ్రదర్‌. అక్టోబర్ ల్ నా పుట్టిన రోజుకి అమ్మ కొంత డబ్బు ఇచ్చింది. దానికి ఇంకొంత కలిపి ఒక ఆరు లక్షల రూపాయిలు ఇండియన్ డిఫెన్స్ వీరనారి వారికి అందిస్తున్నాం. వరుణ్, దర్శకుడు, నిర్మాత వెళ్లి ఆ డబ్బుని అందిస్తారు. వరుణ్‌ ప్రయత్నాన్ని మె‌చ్చుకున్నారు నాగబాబు. ‘మా పెద్దనాన్న నాకు స్ఫూర్తి. ఆయన మా సినిమా టీమ్‌ని విష్‌ చేయడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. కష్టాన్ని నమ్ముకుని పైకి రావాలని ఎప్పుడూ చెబుతుంటారు పెద్దనాన్న. ఇంతమంది అభిమానుల్ని మాకు ఇచ్చిన ఆయనకు థ్యాంక్స్‌ కృతజ్ఞతలు. అభిమానులు ప్రోత్సాహానికి ప్రేమకి రుణపడి ఉంటానన్నారు వరుణ్‌తేజ్‌. మిగతా నటీనటులు ఈ సినిమా విజయాన్ని టెక్నిషియన్స్ కృషిని మెచ్చుకున్నారు. సినిమా విజయం పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేసారు.

Related Posts