మెగా ‘విశ్వంబర’ కీలక షెడ్యూల్ కంప్లీట్‌

మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా మూవీ విశ్వంబరపై భారీ అంచనాలున్నాయి. రీసెంట్ గా రిలీజయిన గ్లింప్స్‌ ఆ అంచనాలను పదింతలు పెంచేసింది. స్టాలిన్‌ తర్వాత చిరుతో త్రిష కృష్ణన్‌ జోడీ కట్టిందీ చిత్రంలో. వశిష్ట డైరెక్షన్‌లో యువి క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం కీలక షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకున్నట్టు ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ షెడ్యూల్ లో కీలక నటీనటులంతా పాల్గొన్నట్టు తెలిపారు మేకర్స్.


త్రిష కృష్ణన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతన్నాయి. మెగాస్టార్ ఇంట్లో మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణితో సహా యూనిట్ అంతా పాల్గొన్నారు. ఈ మేరకు త్రిష కృష్ణన్ ” లెజెండ్స్‌తో కలసిన అద్భుతమైన రోజు #విశ్వంభర 👑🧿” అంటూ ట్వీట్ చేసారు. చిరంజీవి, త్రిష, వశిష్ట, కీరవాణి, విక్రమ్, వంశీ, ఛోటా కె నాయుడు, ఎఎస్ ప్రకాష్‌ కనిపిస్తున్న మరో పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
విశ్వంభర 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదల కానుంది.

Related Posts