పలాస 1978 కంటే ‘శశివదనే’ పెద్ద హిట్ అవుతుంది – హీరో రక్షిత్ అట్లూరి

సాయి మోహన్‌ ఉబ్బర డైరెక్షన్‌లో గోదారి బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌ ‘శశివదనే’. పలాస 1978 ఫేమ్‌ రక్షిత్ అట్లూరి హీరోగా కోమలి ప్రసాద్ హీరోయిన్‌ గా ఈ చిత్రాన్ని ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్.వి.ఎస్.స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మించారు. ఏప్రిల్ 19 న సినిమా రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రెస్‌మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్.
‘‘శశివదనే’ మా టీమ్ మూడేళ్ల ప్రయాణం. ఇప్పటి వరకు విడుదలైన టీజర్, మూడు పాటలకు ప్రేక్షకుల నంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా టైటిల్, పాటలు ఎంతో సాప్ట్ గా అనిపిస్తున్నాయో సినిమా అంత హార్డ్ హిట్టింగ్ గా ఉంటుంది. మూవీ చూసిన తర్వాత ఓ ఆలోచనతో ఆడియెన్స్ బయటకు వస్తారు. ఈ డెబ్యూ డైరెక్టర్ కి ఇలాంటి సినిమా రావటం చాలా గొప్ప విషయం. నన్ను నమ్మిన గౌరి, అహితేజ, అభిలాష్‌గారికి థాంక్స్ అనే పదం చాలా చిన్నది. వారి మేలుని జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను అన్నారు డైరెక్టర్ సాయి మోహన్‌ ఉబ్బర.


‘అందరూ ఇచ్చిన సపోర్ట్ తో మార్కెట్ లో మా సినిమాకు ఓ మార్క్ వచ్చింది. ఏప్రిల్ 5న రిలీజ్ చేద్దాం అని అనుకున్నాం. కానీ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సినిమాను ఏప్రిల్ 19న రిలీజ్ చేస్తే బావుంటుందని కోరారు. వారి కోరిక మేరకు ఏప్రిల్ 19న సినిమాను రిలీజ్ చేస్తున్నాం. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నామన్నారు నిర్మాత అహితేజ.
తొంబై దశకం స్టైల్లో ఉండే ఎమోషన్స్ ఉండే సినిమాలు చూసి చాలా కాలమైంది. అలాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రమే శశివదనే. సాయి మోహన్ గారు చెప్పినట్లు శశివదనే క్లైమాక్స్ గుర్తుండిపోతుంది. మీ మనసుల్లో వెంటాడుతుంది. మంచి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ సహా అందరూ వంద శాతం కష్టపడ్డారన్నారు హీరోయిన్ కోమలి ప్రసాద్.


దర్శకుడు సాయి మోహన్ కథ చెప్పిన విధానం నాకు ముందు అర్థం కాలేదు. అప్పుడు నేను తనని నువ్వు పలాస సినిమా చూశావా అని అడిగాను. దానికి తను లేదు సార్ అన్నాడు. పలాస సినిమా చూడకుండా నేను ఈ సినిమాను ఎలా పెర్ఫామ్ చేయగలను అనుకున్నావ్ అని అడిగాను. రాత్రికి సినిమా చూసి మాట్లాడుతానని అన్నాడు. అలా జర్నీ ప్రారంభమైంది. హను రాఘవపూడిగారి దగ్గర సాయి వర్క్ చేశాడు. తను కూడా హనుగారంత పెద్ద డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అబ్బాయి, అమ్మాయి మధ్య ఉండే ఎమోషన్ తో పాటు తండ్రి ఎమోషన్‌ని సాయి ముందుగా రాసుకున్నాడు. పలాస కంటే శశివదనే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. అవుతుందని నమ్మకంగా ఉన్నాను అన్నారు హీరో రక్షిత్.
అతిధులు, ఇతర టెక్నిషియన్స్‌ ఈ చిత్రం విజయం పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేసారు.

Related Posts