మాస్ మహరాజ్ తెలుగు రైడ్

మాస్ మహరాజ్ రవితేజ దూకుడు మామూలుగా లేదు. ఒక హిట్ మూడు నాలుగు ఫట్స్ అంటూ కెరీర్ సాగుతున్నా.. అవేవీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ క్రమంలోనే లాస్ట్ ఇయర్ చివర్లో ధమాకాతో వంద కోట్ల క్లబ్ లోకి ఫస్ట్ టైమ్ ఎంటర్ అయ్యాడు వాల్తేర్ వీరయ్యకు పవర్ ప్యాక్డ్ సపోర్ట్ గా నిలిచాడు.

తర్వాత ప్రయోగాత్మకంగా చేసిన రావణాసుర పోయింది. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరావు చివరికి వచ్చేసింది. ఈ యేడాది దసరా సందర్భంగా అక్టోబర్ 20న ఈ చిత్రం విడుదల కాబోతోంది. నెక్ట్స్ సంక్రాంతికి ఈగిల్ అనే సినిమా వస్తోంది. వీటితో పాటు హ్యాట్రిక్ కాంబో గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో మరో సినిమా అనౌన్స్ అయింది.


లేటెస్ట్ గా మరో ప్రాజెక్ట్ కూడా ఓకే అయింది. రవితేజ సినిమాలతోనే దర్శకుడుగా పరిచయం అయిన హరీష్‌ శంకర్ డైరెక్షన్ లో సినిమా రాబోతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించే ఈ చిత్రం 2018లో వచ్చిన రైడ్ అనే హిందీ సినిమాకు రీమేక్.

అజయ్ దేవ్ గణ్ హీరోగా నటించిన ఈ మూవీలో పవర్ ఫుల్ పాయింట్ ఉంటుంది. ఓ హానెస్ట్ ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కథ. మాస్ కూ కనెక్ట్ అయ్యేలా బోలెడు అంశాలుంటాయి. ఇక హరీష్‌ శంకర్ చేస్తే తెలుగుతో పాటు రవితేజ ఇమేజ్ కు తగ్గట్టుగా మరింత కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి.

మొత్తంగా ఈ మూవీ ఫిక్స్ అయింది. ఇక ఈగిల్ సినిమా పూర్తి కాగానే ఒకేసారి ఈ రెండు సినిమాలూ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే నెక్ట్స్ ఇయర్ కూడా మూడు సినిమాలతో వస్తాడు రవితేజ.

Related Posts