రెండో షెడ్యూల్ లో తమన్నా ‘ఓదెల 2’

డైరెక్టర్ సంపత్ నంది నిర్మాణంలో మంచి విజయాన్ని సాధించిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతోంది ‘ఓదెల 2’. ఈ సినిమాలో తమన్నా ప్రధాన పాత్ర పోషిస్తుంది. గతంలో సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన ‘రచ్చ, బెంగాల్ టైగర్, సీటీమార్’ సినిమాల్లో గ్లామరస్ రోల్స్ పోషించిన తమన్నా.. ‘ఓదెల 2’లో శివశక్తిగా పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతుంది.

ఆమధ్య వారణాసిలో చిత్రీకరణ మొదలుపెట్టుకున్న ‘ఓదెల 2’ మొదటి షెడ్యూల్ ని అక్కడే కంప్లీట్ చేసుకుంది. లేటెస్ట్ గా ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ షురూ అయ్యింది. ఈ సందర్భంగా ఈ సినిమా షూటింగ్ విశేషాలు తెలుపుతూ ఈ మూవీలో తమన్నా పోషిస్తున్న శివ శక్తి క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది టీమ్. సంపత్ నంది ప్రొడ్యూసర్ గానూ, క్రియేటర్ గానూ వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి.. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ, అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్, నీతా లుల్లా కాస్ట్యూమ్స్ టెక్నికల్ గా ‘ఓదెల 2‘కి మరింత అడ్వాంటేజ్ కాబోతున్నాయి.

Related Posts