డెలివరీకి ముందు ప్రియుడి ఫోటో చూపించింది

ఇలియానా.. తెలుగులో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగింది. సౌత్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో విజయశాంతి తర్వాత కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ గా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఓ రకంగా చెబితే విజయశాంతి ఇమేజ్ వేరు. ఇలియానా కేవలం హీరోయిన్ గా మాత్రమే ఆ రెమ్యూనరేషన్ తీసుకుంది.

అయితే అప్పట్లో ఆమె ఓ తెలుగు హీరోను ప్రేమించిందనీ.. అతను హ్యాండ్ ఇవ్వడంతో బాలీవుడ్ కు వెళ్లిపోయిందనే రూమర్స్ వచ్చాయి. అతనెవరనేది అసలా కథ నిజమేనా అనేది ఎవరికీ తెలియదు. బాలీవుడ్ కు వెళ్లినప్పుడు తన కెరీర్ పీక్స్ లో ఉంది. విపరీతమైన ఆఫర్స్ కూడా ఉన్నాయి. అయినా వదిలేసింది. బట్ బాలీవుడ్ లో తను ఫిట్ కాలేదు. హిట్స్ రాలేదు. అయినా అక్కడే ఉండిపోయింది.

కొన్నాళ్ల క్రితం రవితేజ కోసం అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమా తెలుగులో చేసింది. ఇది డిజాస్టర్. ఇక ఆ తర్వాత ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. అప్పుడప్పుడూ హాట్ హాట్ ఫోటోస్ తో సోషల్ మీడియాను హీటెక్కిస్తూ వస్తోంది. అయితే సడెన్ గా తను ప్రెగ్నెంట్ అనే న్యూస్ చెప్పింది. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంటా అంటూ అంతా అవాక్కయ్యారు.

తన బేబీ బంప్ ఫోటోస్ కూడా పెట్టడంతో అప్పటి నుంచి ఆమె బాయ్ ఫ్రెడ్ ఎవరా అని సోషల్ మీడియా అంతా తెగ సెర్చ్ చేశారు. కానీ ఎవరూ కనిపెట్టలేకపోయారు. కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఆమె వ్యక్తిత్వాన్ని జడ్జ్ చేసే ప్రయత్నం కూడా చేశారు. అవేవీ తను ఎప్పుడూ పట్టించుకోలేదు కాబట్టి లైట్ తీసుకుంది.


ఇక లేటెస్ట్ గా తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. డేట్ నైట్ క్యాప్షన్ తో ఉన్న ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంత చెప్పిన తను అతని పేరు, ఊరు గురించిన వివరాలేం చెప్పలేదు. మరి అంత సీక్రెట్ ఎందుకో గానీ చూస్తుంటే ఇతనూ విదేశీయుడులానే ఉన్నాడు. ఏదేమైనా మరికొన్ని రోజుల్లో డెలివరీ కూడా కాబోతోన్న ఇలియానా ఇప్పుడు సడెన్ గా బాయ్ ఫ్రెండ్ ఫోటో షేర్ చేయడం చూస్తుంటే ఆశ్చర్యంగానే ఉంది. అసలింతకీ వీరికి పెళ్లైందా లేక జస్ట్ లివ్ ఇన్ రిలేషనా అనేది కూడా తేలడం లేదు..

Related Posts