మార్కెట్‌ మహాలక్ష్మి ట్రైలర్ లాంచ్‌

కేరింత ఫేమ్‌ పార్వతీశం, డెబ్యూ హీరోయిన్‌ ప్రణీకాన్వికా జంటగా ముఖేష్ యువ విఎస్‌ డైరెక్షన్‌లో అఖిలేష్ కలారు నిర్మించిన చిత్రం మార్కెట్ మహాలక్ష్మి. ఈ సినిమా ప్రమోషన్స్‌ వినూత్నంగా చేస్తూ సినిమా పై బజ్ పెంచుతున్నారు చిత్ర యూనిట్. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్‌ హైదరాబాద్‌లో జరిగింది.
కేరింత తర్వాత సినిమాలు హిట్స్‌ కాలేదు. ఆ నిరాశలో ఉన్న టైమ్‌లో ముఖేష్ కథ చెప్పడంతో నచ్చి ఒప్పుకున్నానన్నారు పార్వతీశం. మొదట్లో నమ్మకం లేకపోయినా.. 4,5 రోజుల షూట్ తర్వాత డైరెక్టర్ క్లారిటీ చూసి నమ్మకం ఏర్పడిందన్నారు. కేరింత తర్వాత అంత మంచి పేరు తెచ్చే చిత్రం మార్కెట్ మహాలక్ష్మి అవుతుందన్నారు హీరో పార్వతీశం.

మార్కెట్ మహాలక్ష్మి తెలుగులో తన తొలిచిత్రమనీ.. ఈ సినిమా ప్రమోషన్స్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు హీరోయిన్ ప్రణీకాన్విక. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందన్నారు.
మార్కెట్ మహాలక్ష్మిలో నాది ఫ్రెండ్ క్యారెక్టర్ అన్నారు ముక్కు అవినాష్‌. హీరో హీరోయిన్లతో తన కాంబినేషన్‌ సీన్స్ చాలా నవ్విస్తాయన్నారు. చాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ అన్నారు అవినాష్.
ఈసినిమాకి విజయ్‌ దేవరకొండ, విశ్వక్‌సేన్ లాంటి హీరోలు, సాయిపల్లవి లాంటి హీరోయిన్ అయితే సూట్ అవుతుందని.. కానీ బడ్జెట్ పరిమితి కారణంగా పార్వతీశం, ప్రణీకాన్వికను మాత్రమే తీసుకోగలిగామన్నారు దర్శకుడు ముఖేష్‌. కథ రాసేటప్పుడే మార్కెట్ మహాలక్ష్మి అనే టైటిల్‌ ఫిక్సయ్యానన్నారు.

కంటెంట్‌ పై నమ్మకం ఉంచి సినిమా చేసామన్నారు నిర్మాత అఖిలేష్‌. మార్కెట్‌ మహాలక్ష్మిని ధియేటర్లలోనే చూసి ఆదరించండన్నారు.
ఇతర అతిధిలు సినిమా విజయాన్ని కాంక్షించి చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. నటీనటులు, టెక్నిషియన్స్ సినిమా చాన్స్ ఇచ్చినందకు దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పారు.

Related Posts