‘ సాఫ్ట్‌వేర్ పోరగా ‘ అని పాడుతున్న ‘మార్కెట్‌ మహాలక్ష్మి’

మార్కెట్‌ మహాలక్ష్మీ.. ఈమధ్య కాలంలో బాక్సాఫీస్‌ మార్కెట్‌లో బాగా వినిపిస్తున్న పేరు. ఎందుకంటే ఈ సినిమా యూనిట్ చేసే ప్రమోషన్స్ కారణంగా మంచి బజ్‌ క్రియేట్ అవుతోంది. కేరింత ఫేమ్‌ పార్వతీశం మెయిన్‌లీడ్‌తో ప్రణీకాన్విక డెబ్యూ ఇస్తున్న మూవీ ఈ మార్కెట్‌ మహాలక్ష్మి. వియస్ ముఖేష్ యువ దర్శకత్వంలో, ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు.


ఈ సినిమా నుంచి ‘ సాఫ్ట్‌వేర్ పోరగా ‘ అనే లిరికల్ సాంగ్ రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్. మార్కెట్‌ నుండే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న హీరో, అతను ఎదుర్కొనే పరిస్థితులు ఎంతో ఆహ్లాదకరంగా సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. డైరెక్టర్ ‘విఎస్ ముఖేష్’ రాసిన పదాలు, జో ఎన్ మవ్ గ్రూవీ బీట్‌లు మరియు లోకేశ్వర్ ఎడార యొక్క ఎనర్జిటిక్ వాయిస్ ఈ క్రేజీ సాంగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Related Posts