దర్శకుడు కళ్యాణ్ కృష్ణ నిర్మాణంలో ‘లంబసింగి’

ఈమధ్య దర్శకులు నిర్మాతలుగా మారుతోన్న ట్రెండ్ జోరందుకుంది. ఇటీవలే డైరెక్టర్ నక్కిన త్రినాథరావు నిర్మాతగా మారి వరుస చిత్రాలను నిర్మించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. లేటెస్ట్ గా మరో యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కురసాల నిర్మాతగా మారుతున్నాడు. ‘సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం, బంగర్రాజు’ చిత్రాలతో మంచి విజయాలందుకున్న కళ్యాణ్ కృష్ణ.. తన దర్శకత్వంలో చిరంజీవితో ఒక సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.

మరోవైపు కళ్యాణ్ కృష్ణ సమర్పకుడిగా ‘లంబసింగి’ అనే చిత్రం రూపొందింది. హృదయాల్ని స్పృశించే అందమైన ప్రేమకథగా ‘లంబసింగి’ రూపొందిందట. ఈ చిత్రానికి ‘ఎ ప్యూర్ లవ్ స్టోరీ.’.. అనేది ఉపశీర్షిక. మార్చి 15న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. మన దేశంలో సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేష‌న్స్‌కు టూర్ వేయాలని చాలా మంది అనుకుంటారు. ఆంధ్రాలోనూ అటువంటి హిల్ స్టేషన్ ‘లంబసింగి’. ఈ ఊరు పేరుతోనే నవీన్ గాంధీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో భరత్‌ రాజ్ హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ సమర్పకుడైతే.. ఆనంద్.టి నిర్మాత. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘వయ్యారి గోదారి’ అంటూ సాగే గీతం విడుదలైంది

Related Posts