సమ్మర్‌లో ‘లవ్‌ మి’ రిలీజ్‌ డేట్ ఫిక్స్‌

దెయ్యంతో లవ్, దెయ్యంతో రొమాన్స్.. ఆ లైన్ వింటేనే సినిమా ఎంత డిఫరెంట్ గా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇదే లైన్‌తో తెరకెక్కుతున్న సినిమా ‘లవ్‌మి’. ‘ఇఫ్ యు డేర్’ అనేది ట్యాగ్‌లైన్‌. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి ఈ చిత్రాన్ని నిర్మించారు. అరుణ్ భీమవరపు దర్శకుడు. టాలెంటెడ్ యాక్టర్స్ ఆశిష్, వైష్ణవి చైతన్య మెయిన్ లీడ్ చేసారు. టీజర్ కు అమేజింగ్ రెస్పాన్స్ రావటమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలు నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నాయి.
‘లవ్ మీ’ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే క్యూరియాసిటీ అందరిలోనూ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ హారర్ థ్రిల్లర్‌ను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా, స్టార్ టెక్నీషియన్ పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు.

Related Posts