లోకేష్ కనకరాజ్ లైనప్ భారీగానే ఉంది

హిట్టైన సినిమాల క్రేజ్ ను సూపర్ లెవెల్ లో వాడుకుంటున్నారు మన మేకర్స్. ఒక సినిమా హిట్టైందంటే ఆ చిత్రానికి సంబంధించి వరుసగా సీక్వెల్స్ తీసుకొస్తున్నారు. అలాగే.. ఒకే కథను రెండు మూడు భాగాలుగా చెప్పే ఒరవడి కూడా ఈమధ్య బాగా జోరందుకుంది. కొంతమంది దర్శకులైతే ఒకడుగు ముందుకేసి హాలీవుడ్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్శ్ తరహాలో.. పలు సూపర్ హీరో క్యారెక్టర్స్ తో ఓ యూనివర్శ్ నే సృష్టించుకుంటున్నారు. ఈ లిస్టులో ముందున్నాడు లోకేష్ కనకరాజ్.

కార్తీతో ‘ఖైదీ‘ చిత్రాన్ని తెరకెక్కించిన లోకేష్ కనకరాజ్.. దానికి కంటిన్యూస్ గా కమల్ హాసన్ తో ‘విక్రమ్‘ మూవీని రూపొందించాడు. ఇప్పుడు ఇదే సినిమాటిక్ యూనివర్శ్ లో ‘లియో‘ వస్తోంది. ఆ తర్వాత రజనీకాంత్ 171వ సినిమా, కమల్ తో ‘విక్రమ్ 2‘, కార్తీ తో ‘ఖైదీ 2‘, సూర్య హీరోగా ‘రోలెక్స్‘ వంటి సినిమాలు లైన్లో ఉన్నాయట. ఈ సినిమాటిక్ యూనివర్శ్ లో ఒక హీరో నటించిన సినిమాలో మరో హీరో గెస్ట్ రోల్స్ లో అదరగొట్టనున్నారట. మరోవైపు విజయ్ తో లోకేష్ కనకరాజ్ తీసిన ‘లియో‘ అక్టోబర్ 19న విడుదలకు ముస్తాబైంది.

Related Posts