సమరానికి సిద్ధం అవుతున్న విజయ్

ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్‌ కనకరాజ్ డైరెక్ట్ చేసిన సినిమా లియో. అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోందీ సినిమా. విజయ్ సరసన దశాబ్దంన్నర తర్వాత త్రిష హీరోయిన్ గా నటించిన సినిమా ఇది. ఇప్పటికే లియోపై భారీ అంచనాలున్నాయి. లోకేష్ .. విక్రమ్ తర్వాత చేసిన సినిమా కావడంతో పాటు వీరి కాంబోలో ఆల్రెడీ వచ్చిన మాస్టర్ తమిళ్ లో బ్లాక్ బస్టర్ కావడం మరో కారణం.ప్రస్తుతం తరంలో లోకేష్ ఏకంగా మల్టీవర్స్ అంటూ ఇండియాకు హాలీవుడ్ స్టైల్ ను పరిచయం చేస్తున్నాడు. ఆ మేరకు ఈ చిత్రంపై ప్యాన్ ఇండియన్ లెవల్లో భారీ అంచనాలు పెరిగాయి. రిలీజ్ కు దగ్గరవుతున్నా కొద్దీ వాటిని మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నాడు లోకేష్. ఇందుకోసం డిఫరెంట్ ప్యాట్రన్స్ లో ఉన్న పోస్టర్స్ వదులుతూ ఆసక్తి పెంచతున్నాడు. ఈ మొత్తంలోనూ కీప్ కామ్ అంటూ కూల్ గా మంటలు రేపుతున్నాడు.


ఆ మధ్య వదిలిన పోస్టర్ చాలా కూల్ గా ఉంది. దట్టమైన మంచు కొండల మధ్య పరుగులు పెడుతున్న విజయ్ తో పాటు దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా ఉన్న మరో పెద్ద పోస్టర్ ను వదిలాడు. దీనికి క్యాప్షన్ గా ” కీప్ కామ్ అండ్ అవాయిడ్ ద బాటిల్” అనే క్యాప్షన్ పెట్టాడు. ప్రశాంతంగా ఉండు. యుద్ధాన్ని నివారించు అని దీనర్థం. అందుకు తగ్గట్టుగానే అతని ఆలోచనా సరళి ఉన్నట్టుగా ఈ పోస్టర్ డిజైన్ చేశాడు.
ఇక నెక్ట్స్ విడుదల చేసిన పోస్టర్ మరో కోణంలో ఉంది. చాలా సుదీర్ఘంగా లోచిస్తున్న విజయ్ ఫోటోని ఒక రివాల్వర్ మధ్యలో వచ్చేలా డిజైన్ చేసిన పోస్టర్ విడుదల చేశాడు. దీని బ్యాక్ గ్రౌండ్ కూడా మంచుతోనే ఉంది. ఇక ఈ పోస్టర్ క్యాప్షన్ ఏంటంటే.. ” బీ కామ్.. అండ్ ప్లాట్ యువర్ ఎస్కేప్..”. అంటే ప్రశాంతంగా ఉండు. నువ్వు తప్పించుకునే ప్లాన్ చేసుకో అని. ఈ పోస్టర్ సైతం ఇంప్రెసివ్ గా ఉంది.


ఇక లేటెస్ట్ గా విడుదల చేసిన పోస్టర్ ఈ రెండిటికి పూర్తి భిన్నంగా ఉంది. ఈ సారి ఎగసిపడుతున్న నిప్పుల మధ్య కత్తిని సానబెడుతూ కాస్త రౌద్రంగా కనిపిస్తున్నాడు విజయ్. చుట్టూ మంటలు. కళ్లలో పట్టలేని కోపం కూడా ఉంది. దీని క్యాప్షన్ గా ” బీ కామ్.. అండ్ ప్రిపేర్ ఫర్ బ్యాటిల్..” అని ఉంది. ప్రశాంతంగా ఉంటూ.. యుద్ధానికి సన్నద్ధం కావాలని దీనర్థం. అంటే అతను కోరుకున్న యుద్ధం కాదిది అనుకోవచ్చు. తను ముందు యుద్ధం రాకుండా చూడాలనుకున్నాడు. తర్వాత ఆ యుద్ధం నుంచి తను తప్పించుకోవాలనుకున్నాడు. ఈ రెండూ కుదర్లేదు. దీంతో ఇక సమరమే అని సన్నద్ధం అవుతున్నాడన్న అర్థం వచ్చేలా ఈ మూడు పోస్టర్స్ కనిపిస్తున్నాయి.


మొత్తంగా పోస్టర్స్ తోనే కంటెంట్ ను ఎలివేట్ చేస్తూ కాక రేపుతున్నాడు లోకేష్ కనకరాజ్. ఒక రకంగా వీరి కాంబోలో వచ్చిన మాస్టర్ ఫ్యాన్స్ కు వందశాతం సంతృప్తిని ఇవ్వలేదు. ఈ సారి రెండు వందలశాతం ఇవ్వబోతున్నారా అనేలా ఉన్నాయి ఈ పోస్టర్స్. మరి ఈ మూవీతో ఈ ఇద్దరూ ఎన్ని సంచనాలు సృష్టించబోతున్నారో చూడాలి.

Related Posts