జవాన్.. నాన్ స్టాప్

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన జవాన్ సినిమా రిలీజ్ డే మొదటి ఆటతోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. తమిళ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ మాస్ కమర్షియల్ ఎంటర్టైన్ కు ఎంటైర్ కంట్రీ ఫిదా అయిపోయింది. అందుకే రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ నెల 7న విడుదలైన జవాన్ కు ఇప్పటికీ చాలా చోట్ల స్ట్రాంగ్ కలెక్షన్స్ వస్తున్నాయి. వీకెండ్స్ లోనే కాదు.. వీక్ డేస్ లోనూ స్ట్రాంగ్ గా పర్పార్మ్ చేస్తోంది. ఇక చాలా వేగంగా100, 300, 500 కోట్ల మార్క్ ను టచ్ చేసిన ఫస్ట్ బాలీవుడ్ మూవీగా ఇప్పటికే రికార్డ్స్ క్రియేట్ చేసిన జవాన్ చాలా ఈజీగా వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరబోతోంది.


జవాన్ రెండు వారాల్లోనే 900 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. ఖచ్చితంగా చెబితే 13 రోజుల్లోనే ఈ మార్క్ ను చేరుకుంది. 13 రోజుల్లో జవాన్ సాధించిన కలెక్షన్స్ 900. 54 కోట్లు. ప్రస్తుతం మరో వారం వరకూ పెద్ద సినిమాలేవీ లేవు. ఈ ఊపు ఇలాగే కొనసాగుతుందని ఇప్పటికే అర్థం అయింది. సో.. వచ్చే వారం వరకూ ఆ వందే కాదు.. మరిన్ని కలెక్షన్స్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. మొత్తంగా అట్లీకి ఇది డ్రీమ్ ప్యాన్ ఇండియన్ డెబ్యూట్. అటు పఠాన్ తో వెయ్యి కోట్లు కొల్లగొట్టిన షారుఖ్ ఒకే యేడాది ఈ ఫిగర్ సాధించిన హీరోగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు.


ఇక విజయ్ సేతుపతి విలనీ,దీపికా పదుకోణ్ ప్రత్యేక పాత్ర, ప్రియమణి, సాన్యా మల్హోత్రా వంటి వారి సపోర్టింగ్ రోల్స్ తో పాటు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ హైలెట్ గా జవాన్ బాక్సాఫీస్ వద్ద నాన్ స్టాప్ గా దూసుకుపోతోంది.

Related Posts