సెప్టెంబర్ 30న జీ సినిమాలు’ ఛానల్ లో ‘కురుప్’

సెప్టెంబర్ 30న దుల్కర్ సల్మాన్ నటించిన ‘కురుప్’ తెలుగు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తో అలరించనున్న ‘జీ సినిమాలు’ ఛానల్హైదరాబాద్, 27th సెప్టెంబర్, 2022: ప్రేక్షకులకు 24 గంటల పాటు సినిమాలతో నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్న ‘జీ సినిమాలు’ ఎప్పటికప్పుడు కొత్త సినిమాలతో తెలుగు ప్రజలకు మరింత చేరువైతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగా, ఇప్పుడు మరో సూపర్ హిట్ సినిమా యొక్క వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన థ్రిల్లర్ మూవీ ‘కురుప్’ సెప్టెంబర్ 30న సాయంత్రం 6 గంటలకు ‘జీ సినిమాలు’ ఛానల్లో తెలుగులో ప్రసారం కానుంది.

దుల్కర్ సల్మాన్ తో పాటూ శోభిత, షైన్ టామ్, అనుపమ పరమేశ్వరన్, ఇంద్రజిత్ మరియు తదితరులు కీలక పాత్రలలో నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి రివ్యూస్ అందుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, కథ సుకుమారన్ కురుప్ అనే విదేశాలకి పారిపోయిన ఒక వాంటెడ్ క్రిమినల్ చుట్టూ తిరుగుతుంది. డబ్బుపై దురాశతో తాను చేసే నేరాలు మరియు తప్పించుకోవడానికి అల్లే కథలు సినిమాని రక్తి కట్టిస్తాయి. సినిమాలో మనోజ్ బాజ్‌పాయ్, టోవినో థామస్ వంటి నటులు చేసిన పాత్రలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, అద్భుతమైన బాక్గ్రౌండ్ మ్యూజిక్ మరియు కట్టిపడేసే స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు ఒక థ్రిల్లింగ్ అనుభూతిని అందచేయడం ఖాయం.

Related Posts