ఖుషీ గ్రాండ్ గా మొదలుపెడుతుందా..

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన సినిమా ఖుషీ. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ మూవీ సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. అయితే సెప్టెంబర్ నెల ఈ యేడాదికి మోస్ట్ మెమరబుల్ అవుతుందని ట్రేడ్ అంచనావేస్తోంది. ఈ నెలలో అన్ని డేట్స్ లోనూ క్రేజీ మూవీస్ ఉన్నాయి. ఇవన్నీ రిజల్ట్ కంటే ముందు భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంటాయనే విశ్లేషణలు, అంచనాలూ ఉన్నాయి. అలా ఈ నెల ఖుషీతో మొదలు కాబోతోంది.

ఇప్పటి వరకూ ఉన్న లెక్కల ప్రకారం ఖుషీ సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. ఓపెనింగ్స్ కూడా అలాగే ఉంటాయనే చెబుతున్నారు. విజయ్, సమంత జోడీకి ఉన్న క్రేజ్ తో పాటు ఇప్పటికే బ్లాక్ బస్టర్ అనిపించుకున్న హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం కూడా ఓపెనింగ్స్ కు కీలక పాత్ర పోషించబోతోంది. ఓపెనింగ్స్ తోనే కాదు.. రిజల్ట్ పరంగానూ ఖుషీ బ్లాక్ బస్టర్ సాధించాల్సి ఉంది. విజయ్ దేవరకొండ వరుస డిజాస్టర్స్ తో ఉన్నాడు. ఇటు సమంత కూడా యశోద, శాకుంతలం చిత్రాలతో బ్యాడ్ రిజల్ట్స్ చూసి ఉంది.

పైగా ఇవన్నీ తను ప్రధాన పాత్రలో వచ్చిన సినిమాలు. అందుకే తను రెగ్యులర్ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం విజయం సాధిస్తే తర్వాత తన కెరీర్ ను ఎలా టర్న్ చేసుకోవాలనేదానిపై తనకూ ఓ క్లారిటీ వస్తుంది. అటు దర్శకుడు శివ నిర్వాణ కూడా నిన్నుకోరి, మజిలీ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్నా.. టక్ జగదీష్ తో షాక్ తిన్నాడు. తనకు మాస్ కంటే క్లాస్ అయితేనే బెటర్ అని టక్ జగదీష్ వార్న్ చేసిందనే చెప్పాలి.

అందుకే మరోసారి ఆ తరహా కంటెంట్ తోనే ఖుషీతో వస్తున్నాడు. ఈ మూవీ రిజల్ట్ ను బట్టే అతనికి నాగ చైతన్య డేట్స్ ఇస్తాడు అని వేరే చెప్పక్కర్లేదు. ఈ సినిమా ఈ ముగ్గురితో పాటు ప్రస్తుతం నేషనల్ అవార్డ్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉన్న మైత్రీ మేకర్స్ కు కూడా ప్రతిష్టాత్మకమే.

జాతీయ అవార్డుల ఆనందాన్ని ఈ విజయం రెట్టింపు చేస్తుందని వారు నమ్ముతున్నారు. వీటితో పాటు సెప్టెంబర్ లో రాబోతోన్న భారీ సినిమాకు ఈ మూవీ ఓపెనింగ్స్ తో పాటు రిజల్ట్ కూడా కొత్త జోష్ ఇస్తుంది. మరి ఇన్ని బాధ్యతలను నెరవేర్చాలంటే ఖుషీ హిట్ అనే ఒక్క మాట చాలు..

Related Posts