ఖుషీ మూవీ సెన్సార్ పూర్తి

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన సినిమా ఖుషీ. విజయ్, సమంత ఇంతకు ముందు మహానటి సినిమాలో కలిసి నటించారు. కానీ వాళ్లు కథను ముందుకు తీసుకువెళ్లే వారథులుగా కనిపించారు. జోడీగా అనిపించినా.. వీరే ప్రధానం కాదా సినిమాలో. బట్ అప్పుడే వీరి కాంబోలో సినిమా వస్తే చూడాలి అనుకున్నారు చాలామంది. అందుకు తగ్గట్టుగానే కాస్త ఆలస్యమైనా ఈ ఖుషీ వస్తోంది.

శివ నిర్వాణ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలతో సినిమాకు భారీ హైప్ వచ్చింది. ఆ పాటలు సెన్సేషనల్ హిట్ గా నిలిచాయి. హైదరాబాద్ తో పాటు కశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతోంది. ఓ ఇంటెన్స్ లవ్ స్టోరీని ప్రెజెంట్ ఇష్యూస్ ను బేస్ చేసుకుని శివ నిర్వాణ చెప్పబోతున్నట్టు టాక్. ముఖ్యంగా కశ్మీర్ ఎపిసోడ్ హార్ట్ టచింగ్ గా ఉంటుందంటున్నారు. ఈ మూవీకి దర్శకత్వంతో పాటు పాటలు కూడా రాశాడు శివ నిర్వాణ. అబ్దుల్ హేషమ్ అందించిన సంగీతం హైలెట్ అవుతుందంటున్నారు.


ఇక లేటెస్ట్ గా ఖుషీ మూవీ సెన్సార్ అయింది. ఎలాంటి కట్స్ లేకుండా చిత్రానికి “క్లీన్ యూ” సర్టిఫికెట్ ఇష్యూ చేసింది బోర్డ్. ఈ సినిమా నిడివి 2 గంటల 40 నిమిషాలు ఉంది. కశ్మీర్ లాంటి బ్యాక్ డ్రాప్ ఉన్నా కట్స్ లేకపోవడం.. క్లీన్ యూ సర్టిఫికెట్ రావడం కాస్త ఆశ్చర్యమే. అదేటైమ్ లో శివ నిర్వాణ ఎంత పర్ఫెక్ట్ గా రూపొందించాడో కూడా అర్థం అవుతుంది. మైత్రీ మూవీస్ బ్యానర్ నిర్మించిన ఈ సినిమాతో సమంత, విజయ్ ల జోడీ మెస్మరైజ్ చేస్తుందని మాత్రం అనుకోవచ్చు.

Related Posts