విజయ్ సేతుపతి సినిమాపై కరణ్ జోహార్ విమర్శలు

విజయ్ సేతుపతి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ యాక్టర్. చిన్న పాత్రలతో వచ్చి పెద్ద సినిమాలకు ఫస్ట్ ఆప్షన్ గా మారాడు. ఓ వైపు హీరోగా చేస్తూనే విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అదరగొడుతున్నాడు. అందుకే అతనికి అంత డిమాండ్. పైగా అతని నటన ప్రత్యేకంగా ఉంటుంది. సహజమైన ప్రదర్శన చేస్తాడు. ఇది కూడా ఎసెట్ అయింది. అలాగే ఏ పాత్రలో అయినా ఒదిగిపోతాడు.

ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోన్న విజయ్ సేతుపతి ఓ సర్ ప్రైజింగ్ కాంబినేషన్ లో సినిమా చేస్తున్నాడు. కత్రినా కైఫ్ తో విజయ్ సేతుపతి ఓ సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీ రాఘవన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రానికి మెర్రీ క్రిస్మస్ అనే టైటిల్ ఫిక్స్ చేసుకున్నారు. తమిళ్ తో పాటు హిందీలో కూడా విడుదల కాబోతోందీ మూవీ. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో పాటు అనూహ్యమైన విమర్శ కూడా ఒకటి వచ్చింది. అది కూడా బాలీవుడ్ బిగ్ షాట్ కరణ్‌ జోహార్ నుంచి.


మెర్రీ క్రిస్మస్ మూవీ పోస్టర్ తో పాటు ఈ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా ఒక పది రోజులు ముందుగానే డిసెంబర్ 15న విడుదల చేయబోతున్నాం అని ప్రకటించారు. అదే కరణ్‌ కు కోపం తెప్పించింది. ఎందుకంటే అదే టైమ్ కు అతను తను నిర్మిస్తోన్న యోధ అనే సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉన్నాడు కూడా. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా దిశా పటానీ, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని కూడా డిసెంబర్ 15నే రిలీజ్ చేయబోతున్నారు. దీంతో తన సినిమా ఉండగా మరో సినిమా ఎలా అనౌన్స్ చేస్తారు.. చేస్తే చేశారు. “ఓ కర్టెసీ కాల్ కూడా చేయలేదు నాకు. రిలీజ్ డేట్స్ విషయంలో గొడవ పడటం స్టూడియోస్, నిర్మాతల మధ్య మంచిది కాదు. అసలు థియేట్రికల్ రిలీజ్ లలకు సంబంధించి సవాళ్లు ఎదుర్కొంటున్నాము. ఇలాంటి సందర్భాల్లో మనం ఐక్యతగా లేకపోతే సోదర భావం అనే మాటకు అర్థం లేదు.. ” అంటూ కరణ్ జోహార్ మెర్రీ క్రిస్మస్ మూవీ పేరు ఎత్తకుండానే చేసిన విమర్శలు బాలీవుడ్ లో సెన్సేషన్ అయ్యాయి. నిజంగా శ్రీ రాఘవన్ వంటి దర్శకులు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. మరి నిర్మాతలు కదా పూర్తి నిర్ణయం తీసుకునేది.


నిజానికి ఈ మెర్రీ క్రిస్మస్ అనే సినిమా యోధకు గట్టి పోటీ ఇస్తుందా అనేవాళ్లూ ఉన్నారు. బట్ సీనియర్ ప్రొడ్యూసర్ అయిన కరణ్‌ ఆ మాత్రం ఆలోచించకుండానే ఇలాంటి ట్వీట్ చేస్తాడా. సెప్టెంబర్ 7న షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా విడుదలవుతుంది. ఈ సినిమాలో మెయిన్ విలన్ విజయ్ సేతుపతి. మూవీకి అవుట్ స్టాండింగ్ టాక్ వస్తే ఖచ్చితంగా విజయ్ సేతుపతి హైలెట్ అవుతాడు. ఎందుకంటే ఈ చిత్రాన్ని రూపొందించింది తమిళ దర్శకుడు అట్లీ. సో.. ఆ ఫేమ్ తో పాటు కత్రినా కైఫ్ ఫోటో తన యోధ చిత్రానికి పోటీ ఇస్తుందని ఊహించే కరణ్‌ జోహార్ ఈ విమర్శలు చేశాడు. మరి వీటికి మెర్రీ క్రిస్మస్ టీమ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో కానీ.. అతను ట్వీట్ చేసిన తర్వాతే.. కత్రినా కైఫ్ .. విజయ్ సేతుపతి గ్రేట్ యాక్టర్ అంటూ ప్రశంసలు కురిపించడం విశేషం.

Related Posts