గుంటూరు కారంలో మళ్లీ పూజాహెగ్డే

గుంటూరు కారం..ఈ మధ్య ఈ సినిమా గురించినన్న వార్తలు మరే సినిమా గురించీ వినిపించలేదు టాలీవుడ్ లో. మొదలైన దగ్గర నుంచి నేటి వరకూ రోజూ ఏదో ఒక ఇష్యూ అవుతూనే ఉంది. మొదట అనుకున్న కథతో షూటింగ్ కు వెళ్లారు. భారీ యాక్షన్ సీక్వెన్స్ తర్వాత మహేష్‌ నాకు ఈ కథ నచ్చలేదు అన్నాడు. కట్ చేస్తే మరో స్టోరీ ప్రిపేర్ చేసేపనిలో ఉన్నాడు త్రివిక్రమ్.

అది రెడీ అయ్యేసరికి సూపర్ స్టార్ కృష్ణ గారు చనిపోయారు. ఆ బాధ నుంచి ఆయన తేరుకుని వచ్చాక మళ్లీ ఈ కథలో మార్పులు చేర్పులు. ఇందుకోసం కొన్నాళ్ల షూటింగ్ గ్యాప్. తీరా షూటింగ్ స్టార్ట్ కాగానే హీరోయిన్ పూజాహెగ్డే తప్పుకుంది.

త్రివిక్రమ్ క్యాంప్ హీరోయిన్ అన్న ముద్ర ఉన్న పూజా తప్పుకోవడం టాలీవుడ్ కు షాక్ ఇచ్చింది. తను వెళ్లాక అప్పటి వరకూ సెకండ్ హీరోయిన్ గా ఉన్న శ్రీ లీల మెయిన్ లీడ్ లోకి వచ్చింది. ఆమె ప్లేస్ లోకి మీనాక్షి చౌదరి వస్తుందని చెబుతున్నారు.

మరోవైపు సమ్మర్ టైమ్ లో పెట్టుకున్న షెడ్యూల్స్ అన్నీ.. మహేష్‌ బాబు షూటింగ్ కు రాక ఆగిపోయాయి. గత నెలలో అతను షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఇక అంతా ఓకే అనుకుంటోన్న టైమ్ లో ఇప్పుడు మళ్లీ పూజాహెగ్డే గుంటూరు కారంలోకి రీ ఎంట్రీ ఇస్తుందనే వార్త సర్ ప్రైజింగ్ గా ఉంది.


పూజాహెగ్డే మళ్లీ గుంటూరు కారం టీమ్ తో జాయిన్ కాబోతోందనే వార్త నిజమే అంటున్నారు. కాకపోతే హీరోయిన్ గా కాదు. ఐటమ్ గాళ్ గా. యస్.. ఈ మూవీలో ఓ ఐటమ్ సాంగ్ ఉందట. ఆ పాట కోసం పూజా హెగ్డేను సంప్రదించారు. దీనికి ఆమె కూడా సుముఖంగానే ఉన్నట్టు టాక్. అంటే ఇష్టం ఉందా లేదా అనేది తర్వాతి మేటర్ అయితే.. తను ఒప్పుకునేందుకు ఆస్కారం ఉన్న అంశంగా రెమ్యూనరేషన్ ను చెబుతున్నారు.

ఈ మూవీలో తనను హీరోయిన్ అనుకున్నప్పుడు హారిక హాసిని బ్యానర్ భారీ చెక్ నే అడ్వాన్స్ గా ఇచ్చారట. ఇప్పుడా అడ్వాన్స్ ను తిరిగి తీసుకోవడం కంటే తనతో ఓ ఐటమ్ సాంగ్ చేయిస్తే బావుంటుందనే సంప్రదించారట.

అటు పూజా కూడా అంత పెద్ద చెక్ ను వెనక్కి ఇవ్వడం కంటే ఓ మూడు నాలుగు రోజులు పాట చేస్తే అయిపోతుంది కదా అని ఇష్టం ఉందో లేదో కానీ.. దాదాపు ఓకే చెప్పేసిందంటున్నారు. ఈ పాటను ఈ యేడాది డిసెంబర్ లో చిత్రీకరిస్తారట. మరి పూజాహెగ్డేతో ఐటమ్ సాంగ్ అంటే ఇప్పుడు మహేష్‌ బాబు రియాక్షన్ ఏంటా అనేది అందరూ అనుకుంటున్నారు.

Related Posts