వెయ్యి కోట్ల క్లబ్ లో జవాన్

షారుఖ్ ఖాన్ ద్విపాత్రాభినయం చేసిన జవాన్ అంతా ఊహించినట్టుగానే వెయ్యి కోట్లు కలెక్షన్స్ సాధించింది. ఈ ఆదివారంతో జవాన్ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్స్ 1004. 92 కోట్లు. ఆల్రెడీ షారుఖ్ నటించిన పఠాన్ సినిమా ఈ యేడాది వెయ్యి కోట్ల కలెక్షన్స్ సాధించి ట్రేడ్ ను సైతం ఆశ్చర్య పరిచింది. ఎలా చూసినా పఠాన్ కంటే చాలా బెస్ట్ కంటెంట్ తో వచ్చిన జవాన్ కూడా ఆ క్లబ్ లో చేరుతుందని మొదటి ఆటకే ఆడియన్స్ తో పాటు ట్రేడ్ కూడా అంచనా వేసింది.

అనుకున్నట్టుగానే వెయ్యి కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయింది జవాన్. ఒకే యేడాది రెండు సినిమాలతో వెయ్యి కోట్లు సాధించిన ఏకైక హీరోగా షారుఖ్ ఖాన్ ఓ అద్భుతమైన రికార్డ్ కూడా సాధించాడు. అన్నీ కుదిరితే ఈ రికార్డ్ వచ్చే యేడాది ప్రభాస్ బీట్ చేసే అవకాశాలున్నాయి. ఈ మేటర్ ఎలా ఉన్నా.. జవాన్ అతి తక్కువ రోజుల్లోనే వెయ్యి కోట్లు సాధించిన సినిమాగానూ కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.


మాగ్జిమం సౌత్ ఫ్లేవర్ తో హీరో తప్ప దర్శకుడు అట్లీ, హీరోయిన్ నయనతార, విలన్ విజయ్ సేతుపతి, కీలక పాత్ర చేసిన ప్రియమణి, సంగీతం దర్శకుడు అనిరుధ్ తో పాటు దీపికా పదుకోణ్ సహా అంతా సౌత్ వాళ్లే కావడం ఈ సినిమాకు సంబంధించిన ప్రధాన విశేషాల్లో ఒకటి. ముఖ్యంగా దర్శకుడుగా అట్లీ తనదైన శైలిలో మాస్ తో పాటు ఊరమాస్ ను కూడా ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేశాడు. అట్లీ విజన్ ను దద్దరిల్లిపోయేలా చేసింది అనిరుధ్ నేపథ్య సంగీతం. నయనతార పాత్ర ఆ క్యారెక్టర్ ను హుందాగా ఉంచితే.. దీపికా పాత్ర హార్ట్ టచింగ్ అనిపించుకుంది. ప్రియమణి త్యాగం క్లైమాక్స్ ను రక్తి కట్టించింది.


ఒకప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ బాద్ షా అనిపించుకున్న కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఖచ్చితంగా చెబితే చెన్నై ఎక్స్ ప్రెస్ తర్వాత అతన్నుంచి సాలిడ్ హిట్టే లేదు. ఈ లోటును పఠాన్ తీరిస్తే.. జవాన్ నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లింది. సౌత్ సంగతేమో కానీ.. ఇప్పట్లో షారుఖ్ ను బీట్ చేసే హీరో కనిపించడం లేదు.

పైగా అతని నెక్ట్స్ మూవీ రాజ్ కుమార్ హిరానీ డైరెక్ట్ చేసిన డంకీ. ఈ రెండు బ్లాక్ బస్టర్స్ తో తిరుగులేని ఫామ్ లో ఉన్నాడు షారుఖ్. ఇక రాజ్ కుమార్ హిరానీ సినిమా అంటే దేశవ్యాప్తంగా ఓ క్రేజ్ ఉంటుంది. ఈ యేడాది డిసెంబర్ 23న విడుదల కాబోతోన్న డంకీ సైతం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే ఇండియాలోనే షారుఖ్ ఓ రేర్ రికార్డ్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది.

Related Posts