రెహ్మాన్ కంటే ఇతనే బెటర్ అనుకున్నారా

ప్రస్తుతం టాలీవుడ్ అంతా కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ వెంట పడుతోంది. వరుసగా కొత్త సినిమాలకు వారినే తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే తెలుగులో జివి ప్రకాష్ కుమార్, అనిరుధ్ లు తెలుగులో సంగీతం చేస్తున్నారు. హారిస్ జయరాజ్, యువన్ శంకర్ రాజా కూడా మళ్లీ తెలుగులో విజృంభించబోతున్నారు.

అయితే ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చిన మరో తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ నే నాగచైతన్య, చందు మొండేటి, సాయి పల్లవి సినిమా కోసం తీసుకున్నారు. నిజానికి ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ ను తీసుకోవాలని చాలా ప్రయత్నించారు. మరి ఏమైందో సడెన్ గా దసరా సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ వచ్చాడు లైన్ లోకి.


సంతోష్‌ నారాయణన్.. దసరా మూవీకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. అన్ని పాటలూ బ్లాక్ బస్టర్ అయ్యాయి. నేపథ్య సంగీతం కూడా ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచింది. ఓ రకంగా దసరాను విడుదలకు ముందే పాటలతో ప్రేక్షకుల్లోకి పూర్తిగా ఎక్కించింది సంతోష్ సంగీతమే అంటే అతిశయోక్తి కాదు. అతన్నే ఈ సినిమాకు తీసుకున్నారు. అయితే రెహ్మాన్ కోసం ప్రయత్నించినప్పుడు ఆయన భారీ రెమ్యూనరేషన్ చెప్పాడు. ఈ చిత్రానికి బడ్జెట్ కూడా భారీ(80 కోట్లు)గానే అనుకున్నారు కాబట్టి రెహ్మాన్ ను భరించడం కష్టం కాదు అనుకున్నారు. బట్ఇక్కడే రెండు విషయాలు మేకర్స్ ను మేల్కొలిపాయి.


రెహ్మాన్ సంగీతం చేసిన ఒక్క తెలుగు సినిమా కూడా ఇప్పటి వరకూ హిట్ కాలేదు. అంతే కాక.. అతన్ని మ్యూజిక్ డిమాండ్ చేయడం కుదరదు. అంటే మాకు ఫలానా టైమ్ కు పాట కావాలి, లేదా టీజర్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయాలని అడిగితే చేయడు. అతను ఇచ్చినప్పుడే తీసుకోవాలి. ఇది రిలీజ్ డేట్ పై పెద్ద ప్రభావం చూపిస్తుంది. ఈ రెండు అంశాలతో పాటు అతను అర్థరాత్రి నుంచి పనిచేయడం మొదలుపెడతాడు. అంటే రెహ్మాన్ నుంచి మంచి సంగీతం ఆశిస్తే అతనితో పాటు తెల్లవార్లూ కూర్చోవాలి. అది మనవాళ్లు చేయలేరు. ఎందుకంటే తర్వాతి రోజు షూటింగ్స్ ఉంటాయి కాబట్టి.. సో.. ఇవన్నీ ఆలోచించే.. లిమిటెడ్ బడ్జెట్ లోనే అన్ లిమిటెడ్ సంగీతం ఇవ్వగల సత్తా ఉన్న సంతోష్ నారాయణన్ ను ఎంచుకున్నారు.

నిజానికి రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ తో రూపొందే సినిమాలక సంతోష్‌ నారాయణన్ సంగీతం అద్భుతంగా ఇస్తాడు. ఈ విషయం అతను తమిళ్ లో చేసిన కొన్ని సినిమాలు చూస్తే అర్థం అవుతుంది. సినిమాను, కథను స్టడీ చేసి సంగీతం ఇవ్వడంలో సంతోష్‌ బెస్ట్ అంటారు. సో.. నాగ చైతన్య సినిమాకు అతనే బెటర్ అవుతాడేమో..

Related Posts