మరిచిపోతున్న విలువలను గుర్తుచేసే సినిమా ఫ్యామిలీస్టార్‌ – సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్

డైరెక్టర్ ఐడియాను , కథను, ఆర్టిస్టుల పర్‌ఫార్మెన్స్‌ను, నిర్మాణాత్మక విలువలనన్నింటినీ తెరపై అందంగా పరిచి అలరించే బాధ్యత సినిమాటోగ్రాఫర్‌దే. సినిమాకు అత్యంత ముఖ్యమైన బాధ్యతల్లో ఒకటి సినిమాటోగ్రఫి. డాన్, తలాష్, అందధూన్ వంటి బాలీవుడ్ సూపర్ హిట్స్ తో పాటు తెలుగులో మహేశ్ బాబు మహర్షి సినిమాకు సినిమాటోగ్రఫీ అందించిన కెయూ మోహనన్‌ పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఫ్యామిలీస్టార్‌తో తన కెమెరాతో మేజిక్ చేస్తున్నారు. ఫ్యామిలీస్టార్‌ ఏప్రిల్ 5 న రిలీజ్ సందర్భంగా.. ఫ్యామిలీస్టార్ విశేషాలను పంచుకున్నారు సినిమాటోగ్రాఫర్‌ కేయూ మోహనన్.


సినిమాటోగ్రఫీ ఒక స్కిల్ కాబట్టి అందులోనే ఒక ఈస్తటిక్ సెన్స్ ఉంటుంది. విజువల్ సెన్స్ ఉంటుంది. అది ప్రాజెక్ట్ ను బట్టి, సినిమాను బట్టి అప్లై చేస్తూ ఉంటాం. సినిమాలకు కొత్త ఎక్విప్ మెంట్ వాడటం అనేది అవసరం ఉంటేనే చేస్తాను. ఈ కొత్త లెన్స్ వాడాను, ఈ కొత్త కెమెరా తెచ్చాం అని చెప్పుకునేందుకు నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఆ సినిమాకు ఎలాంటి విజువల్స్ కావాలో, అందుకు ఏ పరికరాలు అవసరం అవుతాయో అవి మాత్రమే తీసుకోమని చెబుతుంటానన్నారు మోహనన్.

అలాగే తన ఎంట్రీ గురించి చెప్తూ.. సినిమాటోగ్రఫీ గురించి నేను ఫిలిం స్కూల్ లో నేర్చుకున్నాను. కెమెరా విషయంలో నాదంతా ఫార్మల్ అభ్యాసమే. వరల్డ్ సినిమా చూడటం ద్వారా మరికొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఎన్నో ఏళ్లుగా తెలుగు సినిమాలు చూస్తున్నాను. అప్పట్లో కృష్ణ గారి సినిమాలు, పౌరాణిక చిత్రాలు చూసేవాడిని. మనవన్నీ బేసిక్ గా కమర్షియల్, లార్జర్ దేన్ లైఫ్ మూవీస్. అందుకే సినిమాటోగ్రఫీ విషయంలోనూ న్యాచురాలిటీకి కొంత ఎక్కువగానే విజువల్స్ ఉండాలని కోరుకుంటామన్నారు.


ఫ్యామిలీ స్టార్ సినిమా అనేది ఒక బ్యూటిఫుల్ మూవీ. ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ కథ.క మిడిల్ క్లాస్ ఇల్లు తెరపై చూస్తుంటే..ఇది మన ఇంటిలా ఉంది అనిపిస్తుంది. దర్శకుడు పరశురామ్ ఈ సినిమా నేపథ్యాన్ని సింపుల్ సెటప్ లో క్రియేట్ చేశాడు. విజయ్, మృణాల్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. సినిమా అనేది ఒక టీమ్ వర్క్ కాబట్టి ఆర్టిస్టులు, ఇతర క్రూ అంతా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటామన్నారు. మనం నిర్లక్ష్యం చేస్తున్న ఫ్యామిలీ వ్యాల్యూస్ గురించి చెప్పే సినిమా ఫ్యామిలీ స్టార్. ఇండియా మొత్తం న్యూక్లియర్ ఫ్యామిలీస్ గా మారిపోయాయి. కుటుంబ సభ్యులంతా కలిసి ఉండటం అనేది జరగడం లేదు. ఇలాంటి టైమ్ లో మన ఓల్డ్ ఫ్యామిలీ వ్యాల్యూస్ గురించి డిస్కస్ చేసే సినిమా ఇది. ఇండియన్ ఫ్యామిలీ స్టోరీ అనుకోవచ్చన్నారు.

నా కూతురు మాళవిక మోహనన్ తనకు తానుగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె పేరు నేను ఏ సినిమాకూ రికమెండ్ చేయలేదు. అలా చేయడం కరెక్ట్ కాదని భావిస్తా. నటిగా ఆమె తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి. విక్రమ్ తో పా రంజిత్ రూపొందించిన తంగలాన్ మూవీ మాళవికకు మంచి పేరు తీసుకొస్తుంది. ది గోట్ లైఫ్ ఆడు జీవితం సినిమాకు నేను వర్క్ చేశాను. అయితే ఆ సినిమా షూటింగ్ ఎక్కువకాలం సాగడం వల్ల ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చానన్నారు కేయూ మోహనన్.

Related Posts