ప్రియదర్శి హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ చిత్రం

ఒకవైపు కమెడియన్ గా అగ్రపథాన దూసుకెళ్తున్న ప్రియదర్శి.. హీరోగానూ వరుస సినిమాలతో దుమ్మురేపుతున్నాడు. ‘బలగం‘ తర్వాత హీరోగా మరో మూవీకి కమిట్ అయ్యాడు. కామెడీ మూవీస్ స్పెషలిస్ట్ ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. మార్చి నెలాఖరు నుంచి ఈ సినిమా పట్టాలెక్కనుంది.

సీనియర్ ప్రొడ్యూసర్, శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విలక్షణ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ ‘జెంటిల్ మేన్, సమ్మోహనం‘ చిత్రాలు నిర్మించారు. నాని హీరోగా నటించిన ‘‘జెంటిల్ మేన్‘, సుధీర్ బాబు నటించిన ‘సమ్మోహనం‘ రెండు సినిమాలూ మంచి విజయాలు సాధించాయి. మరి.. ఈసారి వీరిద్దరి హ్యాట్రిక్ కాంబోలో ప్రియదర్శి హీరోగా నటించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు నటించబోతున్నాడు. త్వరలో తెలియనున్నాయి.

Related Posts