‘ఇండియన్ 2‘.. 96, 23 నంబర్ల మతలబు ఏంటి?

కమల్ హాసన్ లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్ ‘ఇండియన్ 2‘ ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఇటీవలే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. 1996లో వచ్చిన ‘ఇండియన్‘ సినిమాకి కొనసాగింపుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు శంకర్.

ఇక.. లేటెస్ట్ గా ‘ఇండియన్ 2‘ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రేపు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలకు సంబంధించి ‘ఇండియన్ 2‘ మూవీ ఇంట్రోస్ రిలీజ్ కాబోతున్నాయి.

‘ఇండియన్ 2‘ తమిళ ఇంట్రోని సూపర్ స్టార్ రజనీకాంత్ విడుదల చేస్తుండగా.. తెలుగు ఇంట్రో కోసం రాజమౌళి రంగంలోకి దిగుతున్నాడు. తమిళ చిత్ర పరిశ్రమను మరో మెట్టు ఎక్కించిన ఘనత శంకర్ సొంతం చేసుకుంటే.. తెలుగు చిత్ర పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ఘనత రాజమౌళిది. అందుకే ఈ సినిమా తెలుగు ఇంట్రో టీజర్ ను జక్కన్న చేత లాంఛ్ చేయించబోతున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు ‘ఇండియన్ 2‘ మలయాళం టీజర్ ను మోహన్ లాల్, కన్నడ టీజర్ ను సుదీప్, హిందీ టీజర్ ను అమీర్ ఖాన్ లాంఛ్ చేయబోతున్నారు. ఇక.. ఆయా భాషలకు సంబంధించి ‘ఇండియన్ 2‘ ఇంట్రోను విడుదల చేయబోతున్న సెలబ్రిటీస్ పిక్స్ తో స్పెషల్ పోస్టర్స్ రిలీజ్ చేసింది టీమ్.

ఈ పోస్టర్స్ లో కనిపిస్తున్న ఆసక్తికర అంశం ఏమిటంటే.. అన్నింటిలోనూ ఆయా సెలబ్రిటీస్ యంగ్ లుక్స్ లో కనిపిస్తున్నారు. పోస్టర్ ఒకవైపు కింద 96.. మరోవైపు కింద 23 నంబర్స్. 96 అంటే 1996లో ‘ఇండియన్‘ సినిమా రిలీజ్ అయ్యిందనుకోవచ్చు.

23 పెట్టడం వెనుకే ఆశ్చర్యం కలుగుతుంది. అంటే ‘ఇండియన్ 2‘ ఈఏడాదే రాబోతుందా? అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఏది ఏమైనా.. రేపు విడుదలయ్యే ‘ఇండియన్ 2.. ఇంట్రో‘ వరకూ ఈ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది?

Related Posts