విశ్వక్ సేన్ హీరోయిన్ తో ఆనంద్ దేవరకొండ

కోవిడ్ పాండమిక్ బ్యాక్ డ్రాప్ లో విశ్వక్ సేన్ హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘అశోకవనంలో అర్జునకళ్యాణం‘. రవి కిరణ్ కోలా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రుక్సార్ థిల్లాన్, రితిక నాయక్ హీరోయిన్లుగా నటించారు. రుక్సార్ ఆల్రెడీ అంతకుముందు తెలుగులో సినిమాలు చేసింది. అయితే.. ఈ సినిమాలో రితిక నాయక్ నటన తెలుగు వారిని బాగా ఆకట్టుకుంటుంది. అందం, చలాకీతనంతో ఈ మూవీలో రితిక స్క్రీన్ ప్రెజెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి.

లేటెస్ట్ గా రితిక నాయక్.. ఆనంద్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాల సెలక్షన్ విషయంలో అన్నకు దీటుగా సాగుతోన్న ఆనంద్ దేవరకొండ ఈరోజు కొత్త సినిమాని ప్రారంభించాడు. ఈ చిత్రానికి ‘డ్యూయెట్‘ అనే టైటిల్ ని ఖరారు చేశారు. మురుగదాస్ దగ్గర పనిచేసిన మిథున్ వరదరాజ ఈ చిత్రానికి డైరెక్టర్. ఈమధ్య వరుస సినిమాలతో అటు తమిళం, ఇటు తెలుగులో దూకుడు పెంచిన స్టూడియో గ్రీన్ ‘డ్యూయెట్‘ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాకి మధుర శ్రీధర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తుండడం విశేషం.

Related Posts