అకౌంట్లో 15లక్షలు పడితే మోదీ వేసినట్టే ..?

ఆన్ లైన్.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట. చదువుకున్న వారికి సమస్యలేదు. చదువురాని వారికి దీంతో ఎన్ని సమస్యలో అనుభవించిన వారికే తెలుస్తుంది. అదేటైమ్ లో రాజకీయ పార్టీలు, నాయకులు ఇచ్చే ఉచిత హామీలు, పథకాలు ప్రజలను ఎలా ఇబ్బందిపెడతాయి అనే కాన్సెప్ట్ తో ఆలోచనాత్మకమైన కంటెంట్ తో రూపొందిన సినిమా ‘భీమదేవరపల్లి బ్రాంచ్”. రమేష్ చెప్పాల డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది.

ట్రైలర్ ఆద్యంత ఆకట్టుకునేలా ఉంది. తాము అధికారంలోకి వస్తే నల్లధానాన్ని వెనక్కి తెప్పించి ప్రతి ఒక్కరి అకౌంట్లో 15లక్షలు వేస్తాం అని చెప్పింది బిజెపి. ఆ ఎన్నికల హామీతోనే 2014లో గెలిచారు. ఈ 15లక్షలు రాలేదు కానీ.. ఆ పేరుతో అనేక సెటైర్స్ వచ్చాయి. అయితే భీమదేవరపల్లి అనే ఊరిలో డప్పు కొట్టుకునే ఒక వ్యక్తి అకౌంట్ లో అనుకోకుండా 15లక్షలు పడతాయి. ఇవి తనకు ప్రధానమంత్రే వేశాడు అనుకుని అతను ఆ డబ్బును జల్సాగా ఖర్చు పెడతాడు. కట్ చేస్తే అది భీమదేవరపల్లి బ్రాంచ్ బ్యాంక్ నుంచి అనుకోకుండా పడ్డాయని.. తిరిగి ఆ డబ్బు కట్టాలని సదరు పేదవాడిపై ఒత్తిడి తెస్తుంది బ్యాంక్. దీంతో అప్పటి వరకూ సంతోషంగా ఉన్న ఊరు ఒక్కసారిగా మారిపోతుంది.

ఊరికి అన్ని మీడయా సంస్థలు వస్తాయి. ఆ డబ్బు గురించి ఆరాలు తీస్తాయి. బ్యాంక్ వారినుంచి వివరాలు తెలుసుకుంటాయి. ఇవన్నీ తెలియని అమాయకపు వ్యక్తి మాత్రం తన లైఫ్ ను నరకప్రాయం చేసుకుంటాడు. దీనికి ప్రధాన కారణం ఎన్నికల హామీయే తప్ప తను కాదనే నమ్మకం అతనిది.. అతనితో పాటు కొందరు మేధావులది కూడా.

Poster of the movie PEEPLI [Live]


మరి ఈ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఒకప్పుడు బాలీవుడ్ లో వచ్చిన ” పీప్లీ లైవ్” అనే చిత్రాన్ని గుర్తుకు తెస్తున్నా.. కంటెంట్ పూర్తిగా వేరు. ఒక వైవిధ్యమైన కథతో బలమైన సంఘర్షణను ఆలోచనాత్మకంగా రూపొందించినట్టు అర్థం అవుతోంది. నటీనటులెవరూ పెద్దగా తెలిసినవారు కాదు. అయినా సహజంగా ఉన్నారు. ఇప్పటికే అనేక అంతర్జాతీయ వేదికలపై అవార్డులు గెలుచుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు విడుదల చేస్తుండటమే ఈ చిత్ర సక్సెస్ కు నిదర్శనం.

Related Posts